ప్రేమాలయాలు

ప్రేమాలయాలు

ప్రేమాలయాలు

రెండు హృదయాల మధ్య తీయని బాధాతప్త జ్ఞాపకాల లోగిళ్ళ సమ్మిళితం ప్రేమ ఒకే జీవితానుభవం,,,,,,,,,
లక్షల పూవులు పుప్పొడి వెదజల్లుతూ ప్రియులకై తపియిస్తూ ఆ గుభాళించే సౌందర్యం ఆస్వాదించేందుకు అంతే మధురమైన ప్రేమానుభూతితో పూవుల హృదయాల నెరిగి ,మకరందం గ్రోలెందుకు పరిభ్రమించే తుమ్మెదల దివ్యానుభూతి,,,,,,,,,,,
ప్రేమికుల ఇరువురి మనస్సులు పాడే మైమరపించే ఆత్మీయత జీవితం లోలోతుల వరకు చుంభించే ఆలింగనం వేదనసంవేదనల పూల మాలలల్లిక,,,,,,,,
రెండు వేర్వేరు గ్రహాల నుండి ఈ భువికేతెంచి ప్రేమ ఊసులు బాసల దివ్యత్వం మీ బిగికౌగిలిలో జీవన్మరణ స్థితిలో సైతం వీడని ప్రగాఢమైన ఆత్మలు లీనమైన సౌందర్యం ప్రేమ,,,,,,,,,,
అబ్బురపరిచే ఘాటు ప్రేమలో అణువణువు ఒకరినొకరు అర్పించుకునే మనస్సులు పూసిన మరుమల్లియలు ఇలలో రాధాకృష్ణుల హృదయాలు ప్రేమాలయాలు,,,,,,,,,,
ప్రేమ జ్వరంలో హృదయాల్లో మధురమైన అలజడి, ఇరువురి మధ్య అబ్బురపరిచే అనురాగం ,మనస్సులు పడే సంవేదనలు గుండె గూడులో శతకోటి జ్యోతుల వెలుగుల ప్రేమానందాలు,,,,,,,,,,

అపరాజిత్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *