యెద మీటిన రాగాలు !
నీ సాన్నిహిత్యం
మండు వేసవిలో
పువ్వుల వసంతాలు
వెన్నెలలు పూచిన పున్నమలు
మల్లెల మనస్విణులు!
హృదయం తెరిస్తే
గులాబీల గుభాళింపులు
అద్భుత రసశ్వినులు
నీ మోము ఓ చంద్రరేఖ
గుండెల్లో గుబులు రేపు
సింధూర పెదవుల నగవులు
తేనెటీగల ఝుంమని రాగాలు హృదయం లోతుల్లోంచి
కమ్మని తేనీయల ఊటల మాటలు
మనస్సు తెలిసినాకొద్ది
శతకోటి దృశ్యాలు
పెనవేయు బంధాలు
వేయి వేణువుల గళం
సాయం సంధ్య సమ్మిళితంలో
ఊహల ఉల్లాసంలో
పొడిచిన తొలి నెలవంకలా
అందనంత దూరం చేరువైయెద మీటిన రాగాలు !
నీ సాన్నిహిత్యం
మండు వేసవిలో
పువ్వుల వసంతాలు
వెన్నెలలు పూచిన పున్నమలు
మల్లెల మనస్విణులు!
హృదయం తెరిస్తే
గులాబీల గుభాళింపులు
అద్భుత రసశ్వినులు
నీ మోము ఓ చంద్రరేఖ
గుండెల్లో గుబులు రేపు
సింధూర పెదవుల నగవులు
తేనెటీగల ఝుంమని రాగాలు హృదయం లోతుల్లోంచి
కమ్మని తేనీయల ఊటల మాటలు
మనస్సు తెలిసినాకొద్ది
శతకోటి దృశ్యాలు
పెనవేయు బంధాలు
వేయి వేణువుల గళం
సాయం సంధ్య సమ్మిళితంలో
ఊహల ఉల్లాసంలో
పొడిచిన తొలి నెలవంకలా
అందనంత దూరం చేరువై
మన మిద్దరమే మరోలోకం!!
జీవితం ఎల్లప్పుడూ రసతుల్యమే
ఆహ్లాదంగా పెనవేసుకున్న బంధాల్లో
ప్రతి వాక్కు సరిగమల సాన్నిహిత్యాలే
ముద్దు మురిపాలు ముంగిలిలో!!
అపరాజిత్
మన మిద్దరమే మరోలోకం!!
జీవితం ఎల్లప్పుడూ రసతుల్యమే
ఆహ్లాదంగా పెనవేసుకున్న బంధాల్లో
ప్రతి వాక్కు సరిగమల సాన్నిహిత్యాలే
ముద్దు మురిపాలు ముంగిలిలో!!
అపరాజిత్