Blog

Your blog category

రైతే మహరాజు,,,,,,ఏమంటావ్,,,,!?

విఫలమైన నా ఆశలేవేలాడే గుమ్మంలా,,,,,,పాట మధురంగా వినిపిస్తోందిరేడియో లో,,,,,,కూలిపోయి శిథిలమైన ఇల్లుగోడల్లో కూడు పెట్టే రైతన్న గోడుగొడున రోదిస్తూ,,,,,,పక్కనే పంటపొలాలపై జల్లేపురుగుల మందు డబ్బా తనకేం తెలియనట్లు పడివుంది,,,,,,,పొట్టకొచ్చిన మూడెకరాల వరిచేనువరదల్లో కొట్టుకుపోయిందిఇక సెలవు రైతన్న అంటూ,,,,,,కళ్ళు రెండు బైర్లు కమ్ముతూఎగశ్వాస దిగాశ్వాసలతో నురుగులు కక్కుతూ,,,,,తన ఆలిది పిల్లల రోదనలకుఊరు దద్దరిల్లింది సత్తెన్నా అంటూ పరుగులు,,,,,,,ఎడ్లబండిలో పట్టణం పెద్దాసుపత్రికి తరలిస్తూ,,,,ఎక్కడో గుండెలు పగిలి రక్తం కారుతున్న దృశ్యం కళ్లల్లో మెదులుతోంది,,,,ఊరిలో ఎక్కడో దూరంగాబైరాగి కుక్క స్మశాన వైరాగ్యంతో రోధిస్తోంది,,,,,,,పైరగాలి దూరమైందనిపంట పొలాలు కన్నీళ్ళవరదతో నిండుకుండలు అయ్యాయి,,,,,,ఎడ్లు పసులు తమతో పాటు రైతు శ్రమల శోకగీతాల గోస ఆలపిస్తున్నట్లురైతుపట్టిన నాగలి ఎడ్లజతఆకలి చచ్చి ఎదట గడ్డి సహించకతమకు తాము గతం జ్ఞాపకాలనునెమరువేసుకుంటున్నాయి,,,,,,రైతు మూగజీవుల బాసలుగుర్తెరిగిన వాడుఆకాశంలో మబ్బులు కూలడంఈతీరు వరదలు పోటెత్తడం తెలియదుబైరాగి మరణమృదంగం వాదనలాచెవులుపగిలి రక్తం కారుతుందని గుర్తెరగలేదు,,,,,,,,శ్రమల శరీరం కాయలుకాసిన కండలుఎంతటి దుఃఖిత విపత్తునైనా తట్టుకుంటుంది ,,,",,ఇది మరువకు,,,,,,,!! -అపరాజిత్…
Read More

కం!!💐💐💐🚩

ప్రేమించిన ప్రేమించుముప్రేమను ద్వేషించిన యెడ ద్వేషించకుమా!ప్రేమను బంచుచు బోవన్ప్రేమికులుగ నిలుచు చుంద్రు పృథ్విని కృష్ణా!! చెట్టున రాలిన పువ్వులుపట్టి యతుక లేరునెవరు ప్రాయత్నమునన్పట్టున నిలిచిన కొమ్మనపుట్టును విరులెల్ల దిరిగి పొదలుగ కృష్ణా!! వీణాపాణివియమ్మావాణీ! విద్యా కలశము వసుధకు తెమ్మా!బోణీచేయమ్మా మావాణిన్ సరిదిద్దు చుండి వరముల నిమ్మా!! -గడ్డం కృష్ణారెడ్డి. రేపాల సూర్యాపేట!!
Read More

పచ్చని చెట్లూ,,,, జరపదిలం,,,,!!

కారడవిలో భయంకర క్రూరమృగాలు సంచరిస్తున్నట్లు మనస్సు పగిలి వక్కలైన అద్దం,,,,, ,పచ్చని ఆకుల రంగు పులుముకున్న దెయ్యం ముఖం,,,,,,,పసిపిల్లలకు ఆకుపచ్చని భూతం అగుపిస్తున్నట్లు తెల్లగా పూసిన చేమంతులు కళ్ళు,,,,,,,పసుపు వన్నె పూవులు నాసికలకు పొగమంచు చలి తీవ్రమైన దుర్గంధ ఘాటు వాసన,,,,,,నోటినుండి అలా అలా దవడలాడిస్తూ జంతువుల మాంసాన్ని బయటకు అగుపడకుండా పళ్ళ కోరలు లోపలనే చీల్చుకుని మింగుతున్న రాక్షసానందం,,,,,,,,,పచ్చని చెట్లన్నీ మమ్ము అడ్డంగా నరికి జంతువులు సంచరించే అడవి,మా సహోదరులను సంహరించి అడవినంతా ఖాండవదహణం చేస్తూ వికటాట్టహాసం చేస్తున్న మానవ క్రూరమృగాలు మీరు బాగుపడరు,,,, ,,,,మనస్సు దొబ్బితిని కళేబరాలు కాలుతున్న స్మశాన సంగ్రామం మీ పొగచూరిన ఇళ్ళు సమాధులపై నిర్మించుకోండి భావంతుల మీద భవంతులు నా కలపతో,,,,,,,,తినడానికి తిండి కరువు. ఉండడానికి ఇళ్ళు లేక చిరిగిన బట్టలతో శరీరాలు కప్పుకున్న దైన్యం బడిపిల్లల బ్రతుకులు వలస కూలీలు,,,,,,,ఇలాంటి ఆకులపై బహుచక్కగా చిత్రీకరణ నా పూవులతోనే నా కర్రలతోనే నన్ను గొడ్డలితో…
Read More

ఆ!వె!!💐💐💐🚩

లక్ష్మిరాదట చెడు లక్షణమ్ములు నున్నగౌరి నిలువబోదు కఠినునింట!వాణినిలుచునెట్లు పట్టి చదవకున్నశక్తిమంతుడైన జరుగునన్ని!! పదులువంద వేయి, పదివేలు పదులైనలక్షణమ్ముగాను లక్షయె గద!లక్షలవియు వం రయమున కోటియౌతెలుసుకోర కృష్ణ తెలివితోడ!! వేయిమంది స్త్రీలు వెంటుండ నేమియుసొంత భార్య వలెను సుఖము రాదు!మల్లెకు సమమౌనె? మందార పూలెల్లతెలుసుకోర కృష్ణ తెలివితోడ!! ప్రగతిబాట మరచి పనిలేక దిరుగుచుబానిసలుగ జేయు ప్రజలనెల్ల!ఓటు నోటు గోరి ఓటరు తానోడుతెలుసుకోర కృష్ణ తెలివితోడ!! ప్రగతిబాటననుచు పదవులు చేపట్టిప్రగతినొందు నేత ప్రజలముంచి!పదుగురాడుమాట వసుధపై నిదియేనుతెలుసుకోర కృష్ణ తెలివితోడ!! అవతరించె చూడు అర్థనారీశుడుచీరలమ్ము వాడు సిగ్గువీడి!బాధలెల్ల మోయు బ్రతుకుదెరువు గోరితెలుసుకోర కృష్ణ తెలివితోడ!! -గడ్డం కృష్ణారెడ్డి. రేపాల సూర్యాపేట!
Read More
ఆత్మచిత్రం – డా.కేదారనాధ్ సింగ్ కవితలు

ఆత్మచిత్రం – డా.కేదారనాధ్ సింగ్ కవితలు

ఆత్మచిత్రం - డా.కేదారనాధ్ సింగ్ కవితలు ఒక కవి ఆత్మను పట్టుకోవాలంటే అతని అక్షరాలే కాదు, అతని తిరుగాడిన నేల పరిమళం, నడయాడిన మనుషుల వాసన కూడా ముఖ్యం. అప్పుడు కానీ ఆ కవి అవగతం కాడు. సరిగ్గా కిల్లాడ సత్యనారాయణ గారు ఆ పనిచేశారు. సుప్రసిద్థ హిందీ కవి, జ్ఞానపీఠాన్నందుకున్న డా.కేదారనాథ్ సింగ్ కవిత్వం ఆయన్ని కుదురుగా కూచోనివలేదు. ఉత్తరప్రదేశ్ లోని వారి స్వగ్రామం చకియా దర్శించేలా చేసింది. ఆయన పేరు చెబితే చాలు ఆ గ్రామ పులకించిపోవటం చూశారు. అలా కేదారనాథ్ సింగ్ సాహిత్యం మొత్తాన్ని ఆవాహన చేసుకున్నారు.. కేదారనాథ్ కవిత్వంలోని మనుషులను, మూగజీవాలను గుర్తుపట్టారు.ఆయనకు భోజ్ పురి భాషంటే ప్రాణమని గుర్తించారు.  హిందీ నా దేశం భోజ్ పురి నా ఇల్లు ఇంటినుండి బయటకి వస్తే దేశంలోకి వెళ్లి పోతాను "మాతృభాష" కవితలో ఆయన పంక్తులు గుర్తు చేస్తారు.  కేదారనాథ్ సింగ్ కవిత్వం లోంచి వంద రసగుళికలను…
Read More