Trending Now

వణుకుపుట్టిస్తున్న చలి తీవ్రత….!!

వణుకుపుట్టిస్తున్న చలి తీవ్రత….!!

వణుకుపుట్టిస్తున్న చలి తీవ్రత....!! శరీరాన్నంతా వణుకుపుట్టిస్తున్న చలిలో ఈఅద్దం నా ముఖాన్ని పగుళ్ళుదేరిన పది తలల రావణాసురుని ముఖం లెక్క ప్రతిబింబిస్తోంది,,,,,,,ఈ ఎండిపోయిన కొమ్మల మాటున పున్నమి చంద్రుడు చలిని రెచ్చగొట్టే వెన్నెల ఎర్రని మంటల్లా చలి ఒళ్ళంతా రంపంతో చీరేస్తూ ముళ్ల ముసుగు తన్ని నేను ఆరుబయట నిద్దరోతూ,,,,,,,,ఈచలి ఊరు మీదబడి ఒక్కోని శరీరాన్ని గజగజ వణికిస్తూ హిమానీనదాలను చంద్రుడు ఉత్పాతంలా శ్రవిస్తున్నట్లు ఒంట్లోని సత్తువ తినేస్తూ ఈదురుగాలులు,,,,,,ఈ చలి తీవ్రతకు చెట్లన్నీ జీవం కోల్పోయి ఆకులన్నీ రాల్చి మృత కళేబరాల్లా మ్రోడులై ఇసుమంతైనా జీవం లేని చలిలో రోధిస్తున్నాయి,,,,,,,,,,ఆకాశం నుండి మంచుకురుస్తూ జీవుల పాలిట యమకింకరుల్లా రక్తం గడ్డకట్టే చలికి ఏడ్చేందుకు ఒంట్లో సత్తువలేక రక్తాక్షరాలు కలలు కోల్పోయిన కళలై వివర్ణమవుతూ గజగజ వణుకుతూ రాగాలుపోతున్నాయి,,,,,,,ఆ నిప్పుల కుంపటిని తీవ్రమైన చలి ఆవరించి మంచుముద్ద చేస్తోంది ,,,,,,,,,,,బకాసురుడు నోరు తెరుచుకుని ఊరుమీద పడ్డట్లు వణుకు పుట్టిస్తున్న చలికి తాళలేక…
Read More
మౌనంలో ప్రేమ

మౌనంలో ప్రేమ

మౌనంలో ప్రేమ నా ప్రాణానికి ప్రాణమైన నీకు… నువ్వు నిప్పువైతే… నేను మంచును. మనమిద్దరం కలిస్తే ఒకరు కరిగిపోవాలని లేదా ఒకరు ఆరిపోవాలని లోకం అంటుంది. కానీ, ఆ నిప్పులోనూ ఒక వెచ్చని తోడుని, ఈ మంచులోనూ ఒక స్వచ్ఛమైన ప్రేమని మనం వెతుక్కున్నాం. కానీ కాలం మన వేళ్లను విడదీస్తోంది. నీ చేయి నా చేయిని వీడుతున్న ఆ క్షణం. నా ప్రపంచం ఆగిపోయినట్లు అనిపిస్తోంది.నీ స్పర్శ తాలూకు వెచ్చదనం ఇంకా నా వేలిపై మెరుస్తున్న ఆ ఉంగరంలాగే నా మనసులో నిలిచిపోయింది. విడివడి వెళ్తున్నావు కానీ, నీ జ్ఞాపకాల లిపి నా గుండె గోడల మీద పచ్చబొట్టులా ఉంది.నీ వాలు చూపులు నాపై పడినప్పుడు వికసించిన విరులు , నేడు కన్నీటి ధారలతో తడిసిపోతున్నాయి.కాలంతో వడిగా పరుగెత్తుతూ నిన్ను నా నుండి దూరం చేస్తున్నా, నీపై నాకున్న ప్రేమ మాత్రం ఎప్పటికీ వాడిపోని పరువంలా నిలిచి ఉంటుంది. నువ్వు…
Read More
మడిపల్లి భద్రయ్య

మడిపల్లి భద్రయ్య

మడిపల్లి భద్రయ్య (తెలంగాణ కవి, రచయిత, ఉత్తమ ఉపాధ్యాయుడు) మడిపల్లి భద్రయ్య తెలంగాణా ప్రాంతానికి చెందిన రచయిత, ఉత్తమ ఉపాధ్యాయుడు, ఆధ్యాత్మికవేత్త.ఇతడు 1945, జనవరి 17వ తేదీన నిర్మల్ పట్టణంలో మడిపల్లి వీరయ్య, గంగమ్మ దంపతులకు జన్మించాడు. తెలుగు భాషమీద ప్రత్యేక అభిమానంతో తెలుగులో ఉన్నత విద్యను అభ్యసించాడు. 1968లో బి.ఎ.ఉత్తీర్ణుడయ్యాడు. ఇతని తండ్రి వీరయ్య కూడా విద్వత్కవి. ఆయన వేములవాడ రాజరాజేశ్వరుని మీద సీసపద్యాలలో ఒక శతకాన్ని వ్రాశాడు. తండ్రి నుండి ఇతడు పద్యాలను ఎలా ఆలాపించాలో నేర్చుకున్నాడు. ఇతడు ఐదవ తరగతి చదువుతున్నప్పుడు కోరుట్ల ఆంధ్ర బాలానందసంఘానికి అధ్యక్షుడిగా ఉన్నాడు. 1963లో లక్సెట్టిపేట పాఠశాలలో ఉపాధ్యాయుడిగా తన ఉద్యోగ జీవితాన్ని ఆరంభించి, భైంసా, దిలావర్‌పూర్, ఇచ్చోడ, ఉట్నూరు, ఆసిఫాబాద్ మొదలైన చోట్ల పనిచేసి 2001లో కుంటాల ఉన్నత పాఠశాలలో గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుడిగా పదవీ విరమణ చేశాడు. ఇతడు జన్నారంలో మిత్రకళాసమితి, ఇచ్చోడలో ప్రత్యూష కళా నికుంజం, ఉట్నూరులో ఆంధ్ర…
Read More
ప్రేమ పెళ్ళి సుఖసంసారం

ప్రేమ పెళ్ళి సుఖసంసారం

ప్రేమ పెళ్ళి సుఖసంసారం ప్రేమించుకున్న యువ జంట పెళ్ళి చేసుకున్న సంబరమే సంబరముద్విగుణీకృత సంతసం జీవితాంతం వెల్లివిరియాలిమనసైన చిన్నదాన్ని మనుమాడిన ప్రియుని హృదయం సంధ్యాకాంతుల లోగిలిప్రేమ సఫలమైన సుందరి మోము గుమగుమలాడే గులాబీతనువులు పరవశించిన తన్మయత్వంలో మనస్సులు వెన్నెలల్లిన చాందినినగు మోములు సింధూర పూవుల్లా మైమరమరపించే రసడోలికలుమందార మకరందాల పరిమళాల విరిజల్లులుమీ దాంపత్యం జీవితాంతం ఇలాంటి హృద్యమైన అనురాగాల హరివిల్లు కావాలిప్రేమసాగరం ఈదిన చందం పిల్లాపాపలతో ఆదర్శ అనురాగాల కుటుంబం కావాలినిత్య యవ్వనంతో సరస సల్లాపాలతో ఒకే పూవు లోని మకరందాన్ని ఆస్వాదించే తుమ్మెదలా సీతారాముల్లా సుఖసంసారం సాగించాలి,,,,,,జీవితంలో సుఖదుఃఖాలలో ఇద్దరు కలిసిమెలిసి చర్చించుకుని పంచుకుంటూ ఓరిమితో సంసార సాగరాన్ని ఈదాలిచుంబనాలతో ఒకరికొకరు ప్రేమామృతాన్ని పంచుకుంటూ రసాస్వాదన చేసుకుంటూ తారచంద్రుల్లా నిత్యం వసంతాల పల్లకిలో ఊయలలూగాలిఇరువురు చేయి చేయి కలగలిపి కష్టపడితేనే జీవనం సాఫీగా సాగిపోతుంది ఇది మరువకు,,,,, అపరాజిత్
Read More
రైతుల ఆక్రందన

రైతుల ఆక్రందన

రైతుల ఆక్రందన కన్నీరు పెడుతున్నారుఅసువులు విడుస్తున్నారుధరణి తల్లి కంట కన్నీరు చిందిస్తున్నారునేలమ్మ నేలమ్మనీకు విల్లా లు ఎలమ్మడబ్బులున్న బాబులుభూములు తక్కువకి కొన్న రోజులురైతులు ఆక్రతలు వినలేని రోజులువారు ఉచ్చ పోస్తే దివ్య అయ్యి వెలిగిందిరైతులు కన్నీరు మాత్రం చిందిస్తూ వినిపిస్తూనే ఉన్నారుకాశీలోని అన్నపూర్ణ సైతంమా రైతులను విడిచింది కాబోలుపంటకి తగ్గ గిట్టుబాటు ధర లేక రోదనఇట్టి స్థితిలో భూముల అమ్మిన గిట్టుబాటు ధర లేక వేదనరైతుల రక్తంఎర్ర సూర్యుని నొసటి తిలకం24 గంటలు కన్నీరు పెడుతున్నా ప్రతీకంవారి రక్తం ఎర్ర సముద్రంలో కలిసిపోయిన ద్రావణం అయిపోయిందిదాన్ని భూ దందా వారుబీర్లలో మరియు వైనులలో కలుపుకొని ప్రశాంతంగా ఆరగిస్తూ తాగుతున్నారువారి జేబులో పూర్తిగా డబ్బు నిండినదివారి బ్రీఫ్ కేసులో డబ్బు నిండినదిమరి బీరువాలు లో డబ్బులు నిండినవిపేదవాడి జీవితం మాత్రం అట్లానే ఉండినదిరైతు కడుపున అన్నానికి సున్నం కొట్టి బ్రతికేస్తున్నారుఏమిటి ఘోరంఏమిటి ఆక్రందనంఏమిటి ఈ నైజంఏమిటి ఈ అకుంఠిత వైపరీత్యంన్యాయం జరగదా ఈ…
Read More
కాలి కూలిపోయిన జీవితంలోంచి వెలుగులు వర్షం…..!!

కాలి కూలిపోయిన జీవితంలోంచి వెలుగులు వర్షం…..!!

కాలి కూలిపోయిన జీవితంలోంచి వెలుగులు వర్షం.....!! తెలిసీ తెలియక నాకై నేనే,నాపై నేనే దుష్ట కర్మలతో కూలిపోయాను,,,,,ఎవ్వరూ తొక్కని మార్గంలో పయనించి విసిగిపోయాను,,,,,ఒక్కళ్లంటే ఒక్కళ్ళు నేను వెళ్ళే మార్గం క్షేమకరం కాదని అనలేదు తల్లిదండ్రులతో సహా,,,,,,,,ఎందుకంటె ఒకానొకప్పుడు విజయ శిఖరాలపై ఉర్రూతలూగుతున్నాను కనుక,,,,,,,,వీటిదేముందిలే చిన్న చిన్న పొరపాట్లు అనుకున్నారు,,,,,,ఆ చిన్నవే అగాధలోయల్లోకి తోసేసి దినదిన గండమై కుదేలయ్యాను,,,,,,మొదటి నుండి చదవటం అలవాటు కనుక ఎవ్వరూ అనుమానించలేదు,,,,,,,ఆ దోషాలే పూసిన యవ్వనంలో కాలం కోరలు తెరుచుకున్న విషనాగై కాటేసింది,,,,,,,,నా అన్నవాళ్ళంతా నన్ను వెర్రినా పిచ్చికొడుకు అంటూ ఎగతాళి చేసినవాళ్ళే చుట్టూర,,,,,,,,నాకు తెలిసి నేను ఎవ్వరికీ ఏ అపకారం చేయని రాముడు మంచి బాలుడు లా పెరిగాను,,,,,,,ఆ వేటకారాల్లో లేనిపోని నిందల్లో చదువుకున్న మూర్ఖున్నని తీసిపడేశారు,,,,,,,,గాఢాంధకారంలో నా చదువులన్నీ నీటిమీది రాతలయ్యాయి అని బ్రమపడ్డాను,,,,,,,ఆ భ్రమ విభ్రమల్లో నా కూలిపోయిన ఆశల శిఖరాల శిథిలాల్లో రోధించాను,,,,,,,,,లోకం నన్ను కుళ్లబోడిచి నేను ఒకడు ఉన్నాడు అన్నది…
Read More
కాకాని చక్రపాణి (కథారచయిత, నవలాకారుడు, అనువాదకుడు)

కాకాని చక్రపాణి (కథారచయిత, నవలాకారుడు, అనువాదకుడు)

కాకాని చక్రపాణి (కథారచయిత, నవలాకారుడు, అనువాదకుడు) కాకాని చక్రపాణి తెలుగు కథా రచయిత. మానవ జీవన సంఘర్షణలను, అక్రోశాలను, అత్మీయతానుబంధాలను హృద్యమైన శైలిలో రుపుదిద్దగల శిల్పి అయన. వీరు దాదాపు పన్నెండు నవలలు, ఎన్నో కథలు లెక్కకు మించిన అనువాదాలు, వ్యాసాలు ప్రకటించారు. కాకాని చక్రపాణి గుంటూరు జిల్లా, మంగళగిరి మండలం చినకాకాని గ్రామంలో 1942, ఏప్రిల్ 26వ తేదీన శ్రీరాములు, సుబ్బమ్మ దంపతులకు జన్మించారు. వీరు మంగళగిరి సి.కె.ఉన్నత పాఠశాలలో ప్రాథమిక విద్యాభ్యాసం ముగించి, ఉన్నత విద్యను గుంటూరులో కొనసాగించారు. 1966లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇరువురు కుమారులు. 1993లో భార్య మరణించగా 1999లో పునర్వివాహం చేసుకున్నారు. 1970లో ఇంటి నుండి తిరుపతికి 600 కి.మీ.ల దూరం కాలినడకన ప్రయాణం చేయడం వీరి జీవితంలో ముఖ్య ఘట్టం. వీరు హైదరాబాద్లో ఆంధ్ర సారస్వత పరిషత్తు ప్రాచ్య కళాశాలలో 1974 నుండి 2000 వరకు 37 సంవత్సరాలు ఆంగ్లభాషా బోధకుకులుగా పనిచేసి…
Read More
పిలకా గణపతిశాస్త్రి (కవి, వ్యాఖ్యాత, నవలా రచయిత, అనువాదకుడు, ఆర్ష విద్వాంసుడు, పత్రికా సంపాదకుడు)

పిలకా గణపతిశాస్త్రి (కవి, వ్యాఖ్యాత, నవలా రచయిత, అనువాదకుడు, ఆర్ష విద్వాంసుడు, పత్రికా సంపాదకుడు)

పిలకా గణపతిశాస్త్రి (కవి, వ్యాఖ్యాత, నవలా రచయిత, అనువాదకుడు, ఆర్ష విద్వాంసుడు, పత్రికా సంపాదకుడు) పిలకా గణపతి శాస్త్రి ( జ:ఫిబ్రవరి 24, 1911 - మ:జనవరి 2, 1983) కవి, వ్యాఖ్యాత, నవలా రచయిత, అనువాదకుడు, ఆర్ష విద్వాంసుడు, పత్రికా సంపాదకుడు. 1911 ఫిబ్రవరి 24న తూర్పు గోదావరి జిల్లా కట్టుంగ గ్రామంలో జన్మించాడు. విజయనగరం సంస్కృత కళాశాలలో సాహితీ విద్యా ప్రవీణ పట్టా పొందాడు. ఆయన రాజమహేంద్రవరం ఆంధ్ర యువతీ సంస్కృత పాఠశాలలోను, వీరేశలింగం పాఠశాలలోను తెలుగు పండితుడుగా పనిచేశాడు. కవిగా, వ్యాఖ్యాతగా, నవలా రచయితగా, అనువాదకునిగా, ఆర్ష విద్వాంసుడుగా పత్రికా సంపాదకుడుగా విశేష ఖ్యాతి పొందాడు. పిలకా గణపతి శాస్త్రి ఆంధ్ర శిల్పి, ఆంధ్రభారతి, ఆంధ్రప్రభ వంటి పత్రికలకు సహాయ సంపాదకుడుగా పనిచేశాడు. గణపతి శాస్త్రిగారు జనవరి 2, 1983లో మరణించారు. రచనలు నవలలు విశాల నేత్రాలు (ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ బహుమతి)హేమపాత్ర - విప్రనారాయణ కథ…
Read More

ఓగేటి అచ్యుతరామశాస్త్రి (పేరొందిన వక్త, కవి, రచయిత, పరిశోధకుడు, గ్రంథకర్త)

ఓగేటి అచ్యుతరామశాస్త్రి (పేరొందిన వక్త, కవి, రచయిత, పరిశోధకుడు, గ్రంథకర్త) ఓగేటి అచ్యుతరామశాస్త్రి పేరొందిన వక్త, కవి, రచయిత, పరిశోధకుడు, గ్రంథకర్త. ఇతడు 1932, జనవరి 2న జన్మించాడు. క్విట్ ఇండియా ఉద్యమంలోను, హైదరాబాదు విమోచన ఉద్యమంలోను పాల్గొని కారాగారవాసం చేశాడు. ఆంధ్ర, ఆంగ్ల, సంస్కృత, హిందీ భాషలలో ఇతడికి విస్తృతమైన పరిచయం ఉంది. 1970లో సంస్కృత థియేటర్ అనే సంస్కృత నాటక ప్రయోగ సంస్థను స్థాపించి దానికి అధ్యక్షుడిగా వ్యవహరించాడు. ఇతడు నాటక ప్రయోక్త, నటుడు, దర్శకుడు, గాయకుడు కూడా. రంగస్థలం మీద, ఆకాశవాణిలో ప్రసారమైన అనేక నాటకాలలో ఇతడు నాయక, ఉపనాయక పాత్రలను పోషించాడు. 1974లో ఇతడు సంస్కృత భారతీ అనే సంస్కృత పత్రికను స్థాపించి సంపాదకునిగా వ్యవహరించాడు. ఇది హైదరాబాదు నుండి వెలువడిన తొలి సంస్కృత పత్రిక. 1978లో ఉత్తమ ఉపాధ్యాయుడిగా రాష్ట్రప్రభుత్వ పురస్కారం స్వీకరించాడు. రచనలు శంకరాచార్య (1958) - పద్యకృతిబంధాబైరాగి (1959) - చారిత్రక…
Read More
మల్లవరపు జాన్ (తెలుగు కవి)

మల్లవరపు జాన్ (తెలుగు కవి)

మల్లవరపు జాన్ (తెలుగు కవి) మల్లవరపు జాన్ ప్రసిద్ధకవి. జాను కవి గారు 2 జనవరి 1927లో జన్మించారు. మల్లవరపు దావీదు, శ్రీమతి రత్నమ్మ గార్లు వీరి తల్లి తండ్రులు. ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లాలోని చీమకుర్తి వీరి జన్మ స్థలం. వీరి కుటుంబానికో ప్రత్యేకత ఉంది. వీరి కుమారుడు మల్లవరపు రాజేశ్వరరావు, కుమార్తె కోటి రత్నమ్మ, మనవడు ప్రభాకరరావులు మంచి కవులు. ఒక మనవడు మంచి చిత్రకారుడు. జాను కవి గారు ది:12 ఆగష్టు, 2006 న మరణించారు. ఆయన కుమారుడు మల్లవరపు రాజేశ్వరరావు తన తండ్రిపేరుతో తెలుగు సాహిత్యంలో విశేషమైన సేవచేసిన వారికి ప్రతియేడాది ఒక పురస్కారాన్ని ఇవ్వాలని నిర్ణయించారు. ఈ పురస్కార కమిటీకి మల్లవరపు సుధాకరరావు, మల్లవరపు ప్రభాకరరావులు ట్రస్టీలుగా ఉన్నారు. వీరిద్దరూ ప్రవృత్తి రీత్యాకవులు, వృత్తి రీత్యా కమర్షియల్ టాక్స్ ఆఫీసర్స్ గా పనిచేస్తున్నారు. ఈ పురస్కారాన్ని 2016 నుండి ప్రారంభించారు. తొలిపురస్కారాన్ని ప్రముఖకవి, పరిశోధకుడు,…
Read More