మనస్సు తనది కాకపోతే,,,,,,,!!
వ్యక్తి నిగూఢ లోతుల్లోని
గతంలో ఎప్పటివో చేదు అనుభవాలు
జ్ఞాపకాలలోనివి అభూతకల్పనలు కొన్ని
చుట్టుముట్టి మనస్సు పొరలలో
అతి సూక్ష్మంగా మెదడులో రసాయనిక సమ్మేళనాలు
గతులు తప్పడం వల్ల నిద్రలేమితో
తీవ్ర మానసిక సంఘర్షణలకు లోనై
గతకాలపు దుఃఖభూయిష్టమైన సంఘటనలు
మనిషి మనస్సు నిండా రివరివమంటూ
ఆలోచనలు చుట్టుముట్టి ఏపనులలోనైనా
ఆసక్తి సన్నగిల్లి మనిషి తనువు మెదడును
కృంగదీసి దినచర్యలు కూడా చేసుకోనివ్వని వేదనలు
చదువు పట్లగాని, చేసే ఉద్యోగాల్లో గాని
ఆసక్తి సన్నగిల్లి తమకు తాము ఒంటరిగా ఉంటారు
తమను ఎవరో వెంటాడుతున్న భయం
తమ మనస్సు ఎవరో తెలియని వారి
ఆధీనంలో పనిచేస్తుందని బ్రమల్లో బ్రతుకు దైనందినం
నరకతుల్య ఆలోచనలతో దిక్కుతోచని స్థితి
మనస్సులోని అంధకార బంధుర ఆలోచనల ఊహలు
అవే నిజమని నిర్ధారించుకుని
ఎదుటి వ్యక్తులను దూషిస్తూ ఒక్కోసారి దాడిచేస్తారు
మనిషి తనపై అదుపు కోల్పోతారు
వైద్యపరిభాషలో డిప్రెషన్ లేదా మనోమంథనం అంటారు
వీళ్ళను సైకోలని సమాజం దూషిస్తుంది
అలాకాకుండా వీళ్ళను సరియైన సైక్రియాటిష్టుకు చూపించాలి
లేదా మానసిక ఆసుపత్రిలో చేర్పించాలి తప్ప
కొట్టడం,దూషించడం చెయ్యకూడదు
ఆలోచనలు స్థిమితం తప్పి తమను తాము
ఏ అఘాయిత్యానికైనా చనిపోయేందుకైనా వెనుకాడరు,,,,,,,,
కనుక మొదట్లోనే వీరి ప్రవర్తన గ్రహించి సరియైన చికిత్స చేయించాలి
తల్లిదండ్రులు గాని భార్యభర్తలు గాని భయపడకుండా జాగ్రత్త పడాలి,,,,,,,,,,
– అపరాజిత్