అన్నా నీ అనురాగం..అన్న ప్రేమ
అన్నా నీ అనురాగం..అన్న ప్రేమ నాకు చిన్నప్పుడే తల్లి, తండ్రి చనిపోయారు . అన్నయ్య నన్ను కంటికి రెప్పలా చూసుకున్నారు. ఆడపిల్లకు తల్లి లేకుంటే ఎన్ని కష్టాలు ఉంటాయో అన్ని నాకు తెలుసు. అమ్మ లేకపోతే ఆడపిల్ల కనీస అవసరాలు చూసే దిక్కు ఉండదు. కానీ మా అన్నయ్య నాకు అమ్మ లేని లోటు తెలియకుండా చూసుకున్నాడు. నాకు ఎలాంటి అవసరాలు ఉన్నా, ఎలాంటి సమస్యలు ఉన్నా , అమ్మ కన్నా ఎక్కువ నాకు చెప్పేవాడు , అంతకన్నా ప్రేమగా చూసుకునేవాడు. అన్నయ్య కు నేను ప్రతి సంవత్సరం రాఖీ పౌర్ణమి రోజు రాఖీ కట్టేదాన్ని. కానీ అది బయట నుండి తేకుండా నాకు నచ్చిన విధంగా తయారు చేసి కట్టేదాన్ని. అన్నయ్య ప్రతి సంవత్సరం నేను కట్టిన రాఖీ ని జాగ్రత్తగా దాచుకునే వాడు. ఒక బాక్స్ లో పెట్టీ అది నాకు సంతోషాన్ని ఇచ్చేది. నేను రజస్వల అయినప్పుడు…