ఆలోచనల అక్షరాలు

ఆలోచనల అక్షరాలు

ఆలోచనల అక్షరాలు

ఆలోచనల అక్షరాలు కళ్ళు కలలుగన్న దృశ్యం ఏటి అలలపై కొట్టుకుపోతూమనస్సులో ఆలోచనలు తోడినా కొలది ఊరుతూమనస్సు నిండా పొగమంచు సాలోచనలు ఎగిసి ఎగిసిపడతూఅడవిని మింగిన ఆలోచనల మనస్సును అడ్డంగా నరికేస్తూఊరు ఉరుముతోంది ఆలోచనల కారుమబ్బులు అగ్ని కురుస్తోంటేపగిలిన ఇసుక మేటలు మంటల్లో ఎడారి ఆలోచనలు ఎండమావులు,,,,,దుఃఖం మింగిన చిక్కని రేయి కొవ్వొత్తి వెలుగులో ఆలోచనలు ముసురుకొస్తున్న మూగరోదన,,,,,,అక్షరాలు రక్తసిక్తమైన అలజడిలో ఆలోచనలు లిఖించలేని అగ్నిపూవులునిండుగా ప్రవహిస్తున్న రక్తంతో ఏరు ఆలోచనలను తోసుకొస్తోందిచింత నిప్పుల్లో పులి కళ్ళు తెరుచుకున్న ఆలోచనలు క్రూరంగా రూపుమాపుతూ విరుచుకుపడుతూఆగిఆగి కురుస్తున్న ఆలోచనలు వర్షంలో సుకుమారులు మానవత్వం అక్షరాలు పేరుస్తున్నాయి కలం నిండా,,,,,,లక్షల జీవితాల అంగడిలో ఆలోచనల గుండెల్లో మానవత్వం తెరిపిస్తూ అక్షరాలను వేలం వేస్తూ ఉచితంగా పంచినా ఉలుకూపలుకూ లేదు,,,,,,మందులో విందుచేసుకునే మాంసంలా జనానికి అక్షరాలు అమృతమయ ఆలోచనలు పట్టి గొంతులో పోసినా దిగవు,,,,,,,ఈ శ్రమల చింతనల ఆలోచనలు నీకేల,,,!? అపరాజిత్
Read More