ఒక చీకటి రాత్రి పార్ట్ 1
ఒక చీకటి రాత్రి పార్ట్ 1 అరేయ్ చిన్న ఎక్కడున్నావురా? ఇదిగో కర్రీ చేశాను, నువ్వు తినాలి అనుకున్నప్పుడు రైస్ పెట్టుకో అంది కిచెన్ లోంచి పద్మ. హా సరే అమ్మా నేను చూసుకుంటాలే మీరు బయలుదేరండి ముందు మళ్ళీ నాన్న తిడతారు అన్నాడు చిన్న అని ముద్దుగా పిలుచుకునే చేతన్. హా అవునవును అమ్మా నేహా అయ్యిందా అంది పద్మ. నేను రెడీ అమ్మా పదా, అంది నేహా బ్యా గ్ బుజాన వేసుకుంటూ. ఈ పరీక్షలు లేకుంటే హాయిగా నువ్వు కూడా వచ్చేవడివు కదా రా అంది పద్మ చేతన్ జుట్టు నిమురుతూ... అవును మమ్మీ పరీక్షలు లేకపోతే నేను కూడా వచ్చేవాడిని హాయిగా ఎంజాయ్ చేసే వాడిని అన్నాడు చేతన్ కాస్త విసుగ్గా.. సరేలే ఈ సారికి ఎలాగో రాసి మళ్లీ ఇంకెవరికైనా పెళ్లి జరిగితే నేనొక్కడినే పంపిస్తాలే అంది పద్మ. హా అయితే మరి నేను నేను…