aaraadhana

ఆరాధన

ఆరాధన అదో చిన్న గ్రామము. బొగ్గు పొయ్యిలపై వంట చేసే సాంప్రదాయము. అప్పటికింకా గ్యాస్ పరిచయం కాలేదు. అందుకే జనాలకి గాసిప్స్ ఆలవాటు కాలేదు. అలమరికలు లేకుండా మాట్లాడేసుకునేవారు. ఇప్పుడు మనకి ఆకాశం అంటే ఒక్కటే కాని ఉదయం పూట మాకు రెండు ఆకాశాలు దర్శనము ఇచ్చేవి. ఒకటి దైవికమైనది. రెండోది మానవికమైనది. ఉదయాన్నే కొన్ని వందల ఇండ్లలో వాకిట్లో బొగ్గు పొయ్యిలు పెట్టేవారు. మా చిన్నారి జీవితాలకి ఆ చిన్నారి ఆకాశం మాకు ఇప్పటికీ తీపి గుర్తుగా ఉండిపోయింది. మా తండ్రి గారిది ప్రభుత్వ ఉద్యోగం. వారు కేటాయించి ఇండ్లలోనే ఉండాలి. అన్ని ఒకే మాదిరిగా రైలు బోగీల్లా విచిత్రంగా కనబడేవి. నేను, నా తమ్ముడు జంట కవులం, చిలిపి చేష్టలకి చిరునామా మా ఇల్లు, కర్ర బిళ్ళ ఆడుతూ, రాయమల్లమ్మ అనే ఒక ఆవిడది గుండు పగలగొట్టాం. ఆమెదే అదృష్టమో ఈ సంఘటనకి ముందు రోజు గుండు కొట్టించుకుని…
Read More