ఆకు + ముల్లు = అద్వైత పార్ట్ 1
ఆకు + ముల్లు = అద్వైత పార్ట్ 1 ఏంటే ఇంతగా రెడీ అవుతున్నావు అడిగింది లత. నా కోసం జగన్ వెయిటింగ్ అక్కడ అందుకే రెడీ అవుతున్నా అంది అద్వైత. ఏంటే అద్వి ఇది? వాడేమో ఏమీ చదువుకున్న వాడు కాదు, వాడిని నమ్మి నువ్వెలా వెళ్తావు? అసలు వాడి లో ఏం చూసి ప్రేమించావు? వాడు మెకానిక్ షాప్ నడిపే వాడు. వాడికి ఎలా పడ్డావే నువ్వు అంది లత నెత్తి కొట్టుకుంటూ, దానికి అద్వైత, వాడు మెకానిక్ అయినా మంచి వాడే చాలా బాగుంటాడు. అందం చూసి ప్రేమ పుట్టదు లత, మంచి గుణాలు చూసి పుడుతుంది. అయినా నీకేం తెలుసు ప్రేమ గురించి, ఒక్కసారి ప్రేమలో పడి చూడు అర్దం అవుతుంది అంది. నీ మొహం ఇక్కడికి మనం చదువుకోవడానికి వచ్చాము కానీ, ఇలా ప్రేమ పాఠాలు నేర్చుకోవడానికి కాదు అంది లత. సరే…