అమ్మాయి అబద్ధపు జీవితం
అమ్మాయి అబద్ధపు జీవితం ఫేస్బుక్ లో స్క్రోల్ చేస్తుంటే ఒక అందమైన అమ్మాయి ఫోటో కనిపించింది వెంటనే అది ఈ అమ్మాయి చాలా బాగుంది అని అనుకుంటూ ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాను. నేను రిక్వెస్ట్ పెట్టడం ఆలస్యం వెంటనే తను యాక్సెప్ట్ చేసింది. ఆహా ఏమి నా భాగ్యము ఇన్నాళ్లకు ఒక అందమైన అమ్మాయితో మాట్లాడబోతున్నాను అనే నా ఉత్సాహం ఉరకలు వేస్తూ హాయ్ అని మెసేజ్ పెట్టాను తను వెంటనే హాయ్ అంటూ మెసేజ్ రిప్లై ఇచ్చింది. మీరు ఎక్కడ ఉంటారు అంటూ అడిగాను నేను బెంగళూరులో ఉంటాను అంటూ చెప్పింది. మీరు ఎక్కడ ఉంటారు అని అడగడంతో నేను హైదరాబాదులో ఉంటాను అని ఆమె అడగకపోయినా నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా వర్క్ చేస్తున్నాను నా జీవితం అంటూ నా వివరాలన్నీ వెంటనే చెప్పేశాను. నా విషయాలన్నీ చెప్పాను కదా మరి మీ విషయాలు చెప్పరా అంటూ అడిగాను. అప్పుడు…