aksharalipi bandanettina baalyam

బండనెత్తిన బాల్యం.!

బండనెత్తిన బాల్యం.! రెక్కడితేగానీ డొక్కాడని నిరుపేద కుటుంబంలో పుట్టి అమ్మానాన్నలకు భారం‌ కాకూడదని బరువెత్తావా బండబారిన ఈ మనుషుల మధ్య రాతిబండను పట్టి లేలేత నీ చేతులు నలిగిపోతున్నా నవ్వుతున్నావా మసిబారిన నీ మోము చూసి కన్నీరొలకని కళ్లుంటాయా కోట్లు ధారబోస్తున్న ప్రభుత్వాలకు నీ శ్రమ కనపడదు పదవికై పరుగెత్తే నేతలకు నీ స్వేదం‌ విలువ తెలియదు ఓ పాలబుగ్గల‌ పసిపాపా..నీకెంత కష్టం వచ్చిందమ్మా నీ తల్లిదండ్రుల ఒడిలో ఒక్క క్షణమైనా సేదదీరేవా?? నేర్చుకోదా గుణపాఠం నినుచూసైనా ఈ సభ్యసమాజం ఆటపాటలతో తోటి పిల్లలు ఆనందంగా గడుపుతుంటే ఎండనకా వాననకా నువ్వీరాళ్లలో అలసిపోతున్నావు బడికెళ్లి పాఠాలు నేర్వాల్సిన ఈ చిరు ప్రాయాన్ని అక్షరాలు‌ దిద్దే స్థోమత లేక మట్టిపాలు చేస్తున్నావు నీ భవిష్యత్తుకు భరోసా ఇవ్వలేని‌ మేమమ్మా పేదలం.! - ది పెన్
Read More