aksharalipi em cheyalante

ఏం చేయాలంటే!

ఏం చేయాలంటే! పూలపరిమళాన్ని ఆస్వాదించాలంటే మనసో పూలవనమై వికసించాలి! నదీ గమనపు పరవశాన్ని నింపుకోవాలంటే హృదయం నదీ మైదానంలా విశాలమై ఉండాలి! పక్షిలా స్వేచ్ఛాగీతిక ఆలపించాలంటే నీలోని బాల్యాన్ని కాపాడుకోవాలి! కన్నీళ్ళను కలతలను కలలతో నింపాలంటే ఆశల నౌకకు లంగరెత్తాలి! మనిషిగా నువ్వెదగాలంటే నిలకడగా ఉంటూ నీచుట్టూ ఉన్న వారిని నువ్వు గౌరవించాలి! - సి.యస్.రాంబాబు
Read More