aksharalipi ganatantra dinotsavam neevekada ganatantra dinotsavam neevekada by bhavya charu

గణతంత్ర దినోత్సవం నీవెక్కడ

గణతంత్ర దినోత్సవం నీవెక్కడ స్వతంత్రమా క్షమించుమా మాకు నీతో పనేమి లేదమ్మా మా ఇష్టం వచ్చినట్టు జీవోలు రాసేస్తాం, మాకు నచ్చినట్టు పరిపాలించుకుంటాం. మా చుట్టాలకు, పక్కాలకే సీట్లు ఇచ్చుకుంటాం, పదవులు ఇచ్చుకుంటాం, వేలు విడిచినా చుట్టాలకు తోడు, పలికిన పక్కాలకి అధికారాలన్నీ అంటగట్టేస్తాం. లేనిపోని పదవులన్నీ సృష్టిస్తాం ఏవేవో పథకాలు అంటూ టెండర్లేసి డబ్బులు నొక్కేస్తాం, ఓటు వేసిన మనిషి నెత్తినె మొత్తుతాం, పెళ్ళాల పేరిట పదవులు కొట్టేస్తాం, వాళ్ల నెత్తిన ముసుగేసి మూలకు కూర్చోబెెట్టేసి అధికారానంత దుర్వినియోగం చేసేస్తాం, జనాల కళ్ళల్లో వాళ్ళ వేలితో వారినే పోడుచుకునేలా చేసేస్తాం, స్వతంత్రమా క్షమించుమా మాకు నీతో పని ఏమీ లేదమ్మా... పెద్ద పెద్ద ప్రాజెక్టు అంటూ డిజనులన్నీ మార్చేస్తాం గంట గంటకు మాటలన్నీ మారుస్తూ అప్పులు ఎన్నో చేసేస్తాం ఆ అప్పులు తీర్చడానికి మళ్లీ పన్నుల బాటలో ధరలన్నీ పెంచేసి, ప్రజల వద్దనే వసూలు చేసి నిధులు ఏవీ లేవంటూ…
Read More