aksharalipi ghosha

ఘోష

ఘోష ఆకలి చావుల ప్రపంచంలో  ఇప్పుడు మరో మరణమృదంగం తాండవమాడుతోంది  మనిషికి మతం ఉన్మాదమిస్తే  దేశాలది విస్తరణ కాంక్ష  శకలాలు శకలాలుగా రాలిపోతూ భవనాలు, కుటుంబాలు ! ప్రపంచం కుగ్రామమయిందంటాం కానీ ప్రపంచం మళ్ళీ కుంగిపోతోంది ఉత్తర దక్షిణ ధ్రువాలుగా ! విశ్వ రహస్యాలను ఛేదించే మనిషి  విస్తరణ కాంక్ష అనే అయస్కాంతానికి దేశాలతుక్కుపోతుంటే నివారించలేని అచేతనుడయ్యాడు ! రణం మొదలవటానికి కారణమక్కర్లేదు  సాకు మాత్రమే చాలని చరిత్ర చెబుతూనే ఉంటుంది ! కాలం కరుకైనదంటాం  కాదు  దేశాలమధ్య రగిలే కాంక్షలు కరాళనృత్యమై  ఉషోదయాల ఉసురుతీసి  అనిశ్చితి ఊబిలో నెట్టేస్తాయి ! నిట్టూర్చే గొంతులనూ నొక్కేసే నెగళ్ళు రాజుకుంటుంటే రెక్కలు తెగిన శాంతికపోతాల రుథిరం నిస్సహాయతకు సంకేతమై  జాలిగా ఘోషిస్తుంటుంది ! - సి.యస్.రాంబాబు
Read More