లేఖ
లేఖ పరువు లేఖ: ఓ తండ్రికి కూతురు రాసిన లేఖ... నాన్న నన్ను గుండెల మీద ఎత్తుకుని ఆడించావు.. అల్లారు ముద్దుగా చూసుకున్నావు.. నన్ను నీ ప్రాణంగా చూసుకున్నావు... నీకు అన్నీ నేనే అన్నావు.. నాకేం కావాలో అన్నీ నాకంటే ముందుగా నువ్వే తెలుసుకొని నాకు ఏ లోటూ లేకుండా చూసుకున్నావు... చిన్నప్పటి నుండి నాకేం కావాలో అన్ని తెలుసుకుని.. నాకు నచ్చినవి అన్నీ ఇచ్చి.. నన్ను ఓ స్థాయిలో ఉంచి.. నా కూతురు బంగారం... తను ఏ పని చేసినా ఆలోచించి చేస్తాది అని, నన్ను సమర్దించావు... నా ప్రతి ఆనందం లో తోడుగా ఉన్నావు.. కానీ నేడు నేను ప్రేమించాను నాన్నా ... అంటే ... ఎందుకు ఒప్పుకోవడం లేదు .. అన్ని ఆలోచించే నేను... నా జీవితంలో ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటపపుడు మాత్రం ఆలోచించకుండా ఉంటానా? ఇది ఎందుకు అర్దం కాదు మీ పెద్దలకి అన్ని విధాలుగా తగిన…