aksharalipi otami ante naakistam

ఓటమి అంటే నాకిష్టం

ఓటమి అంటే నాకిష్టం ఎవరైనా గెలుపునే కదా ఇష్టపడతారు..కానీ వీడేంటి 'ఓటమి అంటే నాకిష్టం' అంటున్నాడని మీకు సందేహం కలగొచ్చు.. నేనలా ఎందుకన్నానో తెలియాలంటే.. ఓటమితో నా ప్రయాణంలో ఓ సంఘటన గురించి మీకు చెప్పాలి. ఒక రోజు మా పాఠశాలలో ఒకమ్మాయి తోటి విద్యార్థిని చెంపమీద కొట్టింది.. ఏమైందని అడిగితే వాడు ఏడిపిస్తున్నాడని చెప్పింది. నిజమేనేమో అనుకున్నామంతా.. విషయం ప్రధానోపాధ్యాయులవారికి తెలిసింది.. ఇద్దరినీ పిలిచి మాట్లాడి, ఆ అబ్బాయిని వారం రోజుల పాటు పాఠశాలకు రావద్దన్నారు. ఆ తరువాత ఆరా తీస్తే, వాడు ఆ అమ్మాయిని పాఠశాల ఆవరణలో ఏడిపించలేదు. బయట ఎక్కడో ఏదో అన్నాడని అభియోగం. కానీ దానికి కూడా ఎలాంటి సాక్ష్యం లేదు. అలాంటప్పుడు వాడినే శిక్షించడమేంటనే వాదన మొదలైంది. అప్పటికి నేను స్కూల్ పీపుల్ లీడర్ (ఎస్పీఎల్) గా ఉన్నాను.. లీడర్ ఎలా అయ్యానో మరో సందర్భంలో చెబుతాలేండి.. అదో పెద్ద కథ. మా సోషల్…
Read More