ప్రేయసీ కో లేక
ప్రేయసీ కో లేక నా అందమైన ప్రియా అందుకో నా ఈ లేఖ నేను నిన్ను ప్రేమిస్తున్నాను ఎందుకో నాకే తెలియదు నీ ఎత్తు పళ్లను చూసా నీ దొడ్డు ముక్కును చూసా నీ లావైన పెదాలని చూసా నీ గుమ్మడి కాయ లాంటి మొఖాన్ని చూసా, నీ పిలక జుట్టును చూసా ఎటూ చూస్తున్నావా తెలియని నీ కళ్ళను చూసా పిప్పళ్ళ బస్తాలా ఉన్న నీ అందమైన నడుమును చూసా అరటి చెట్టులా ఉన్న నీ కాళ్ళను చూసా రాయిలా ఉన్న నీ పాదాలను చూసా స్తంభం లా ఉన్న నీ చేతులను చూసా ఏమీ చూసానో కానీ, నిన్ను చూసిన క్షణం నుండి నువ్వే నా కలలోకి వస్తున్నావు, అందుకే రాస్తున్నా నా ఈ ప్రేమ లేక ,ప్రేమతో నిన్ను నన్ను ప్రేమించమని బతిలాడుకుంటూ కాళ్ళు పట్టుకుని వేడుకుంటూ ఈ లేక పంపుతున్న నా ప్రేమ ను అంగీకరిస్తూ…