aksharalipi story competition

పెళ్లి 2022

పెళ్లి 2022 1986 వ సంవత్సరం అభివృద్ధి చెందుతున్న చిన్న గ్రామం. ఆ గ్రామం లో ఒక ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయునిగా పని చేస్తున్న రాజారామ్ కొడుకు శేఖరంకి డిగ్రీ అయిపోగానే మంచి ప్రభుత్వ ఉద్యోగం వచ్చింది రెవిన్యూ డిపార్ట్మెంట్ లో .. కొడుక్కి ఉద్యోగం దొరకడం తో శేఖరం తండ్రి రాజారామ్, శేఖరం తల్లి రామలక్ష్మి కొడుక్కి పెళ్లి సంభందాలు చూడటం మొదలెట్టారు. శేఖరం తండ్రి ఉపాద్యాయుడు అవడం వల్ల శేఖరాన్ని మంచి క్రమశిక్షణతో పెంచాడు. శేఖరం ఎప్పుడు వాళ్ళ తల్లి తండ్రులని ఎదిరించింది లేదు. తనకు BSC కెమిస్ట్రీ చదవాలని ఉన్నాప్పటికీ తండ్రి ఆదేశించడం తో బీఎస్సీ బోటనీ తీసుకున్నాడు. శేఖరం కోసం రాజారామ్ సంభందాలు చూస్తున్నాడు అని తెలుసుకున్న ఆ ఊరి పెళ్లిళ్ల పేరయ్య రాజారామ్ ని తాను పని చేస్తున్న పాఠశాల దగ్గరకు వెళ్లి కలిసాడు మధ్యాహ్నం భోజనాల సమయం లో... ************ నమస్తే రాజారామ్…
Read More

వసుధ

వసుధ అభివృద్ధికి, నాగరిక సమాజానికి దూరంగా ఉన్న ఆ గ్రామంలో పెళ్లయి సంవత్సరం లోపు సంతానం కలగని ఆడపిల్లని ఆ ఊరి లో ఉండే పెద్ద జమీందారుకు సేవకురాలిగా పంపుతారు. అలా వెళ్లిన అమ్మాయి ఆ జమీందారు కుటుంబానికి అన్ని రకాల సేవలు చేస్తూ ఉండాలి సేవలు అనడం కన్నా బానిస అనడం ఎంతో అర్థవంతం. సంవత్సర కాలం బానిసగా ఉంటూ ఆ ఆడపిల్ల తన భర్తతో సంతానం పొందే ప్రయత్నం చేస్తూనే ఉండాలి. అప్పటికీ సంవత్సరం బానిసత్వం చేసిన కాలంలో కూడా ఆ ఆడపిల్లకి సంతానం కలగకపోతే ఆ అమ్మాయిని జమీందారు కుటుంబం లోని మగవాళ్ళకి తాళి కట్టకుండానే భార్యగా చేసేస్తారు. అలా పెళ్లయి సంవత్సర కాలం అవుతున్నప్పటికీ సంతానం కలగని వసుధని ఆ ఊరి జమీందారు కుటుంబానికి సేవ చెయ్యడానికి పంపించారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్తకి కాకుండా మరో కుటుంబానికి చెందిన మగవాళ్ల మధ్యలో రాత్రియంబవళ్ళు ఉంటూ…
Read More

కానుక

కానుక అందరి అమ్మాయిల లాగానే నాకు కూడా మంచి భర్త, నన్ను ప్రేమించే భర్త రావాలని కోరుకునే దాన్ని నేను కూడా. నేను కాలేజీకి వెళ్లే రోజుల్లో రోజు సరిగ్గా నేను కాలేజీ కి వెళ్లే సమయానికి తన బైక్ మీద మా ఇంటి ముందు నుండి మెల్లిగా వెళ్తూ మూడు సార్లు హార్న్ శబ్దం చేసేవాడు అతను... ఆలా మూడు సార్లు హార్న్ శబ్దం చెయ్యడం అతను నాకు ఇస్తున్న సిగ్నల్... ఆ శబ్దం విన్న ఒక అయిదు నిమిషాలకి నేను బయలుదేరేదాన్ని... మా వీధి చివర ఉన్న చాట్ బండి దగ్గర అతను బైక్ తో ఆగి నాకోసం ఎదురుచూస్తుండేవాడు... నేను అతని దగ్గరికి వెళ్ళగానే దగ్గేవాడు చిన్నగా... దానర్థం నేను అతనిని చూడాలని. నేను అతన్ని కాస్త దాటి ముందుకు వెళ్ళగానే బైక్ మీద నెమ్మదిగా నా వెనకాలే కాలేజీ వరకు వచ్చేవాడు... ఏమి మాట్లాడేవాడు కాదు, నన్ను…
Read More

అక్షరలిపి సంక్రాంత్రి కథల పోటి (గడువు పొడిగించడం జరిగింది)

అక్షరలిపి సంక్రాంత్రి కథల పోటి (గడువు పొడిగించడం జరిగింది)     ముగ్గులు, గొబ్బెమ్మలు, హరిదాసు కీర్తనలు, కోడి పందాలతో ఎంతో సందడిగా జరుపుకునే సంక్రాంతి పండుగ విశేషాలను, మీ ఊర్లోని వింతలను తెలియ చెప్తూ కవితలు, కథలు రాయండి. ప్రతి కవితకి, కథకు ప్రశంసాపత్రం ఇవ్వబడును. మీ కవితలు కథలు పంపవలసిన ఆఖరు తేది 13/ 12/2021 నుండి 13/1/2022 కి మార్చడం జరిగింది. కవిత కానీ, కథ కానీ ఆరువందల పదాలకు మించకుండా అక్షర దోషాలు లేకుండా, సరళ మైన బాషలో ఆకట్టుకునే విధంగా ఉండాలి. ఒకరు ఎన్ని కథలు, కవితలు అయినా పంపవచ్చు. కవితలు కథలు తిరిగి పంపబడవు, వచ్చిన వాటిని అన్నిటినీ ప్రచురిస్తాం. తిరిగి కోరే వారు పంపవద్దని మనవి. ఇందులో న్యాయ నిర్ణేతలదే తుది నిర్ణయం. ఎక్కడ ప్రచురించలేదు అని హామీ పత్రం తప్పని సరి. షరతులు వర్తిస్తాయి. దయచేసి కాపీ కంటెంట్ పంపకండి.…
Read More