aksharalipi suryudu

సూర్యుడు

సూర్యుడు నీ రాక తోనే మొదలయ్యేనుగా నా జీవితం నీవు స్పర్శించనిదే నేను వికసించను నీకై ప్రతీ ఉదయం వేచిచూస్తూనే ఉన్నా నీ వేడిని తట్టుకో లేకపోయినా నీ కిరణం ముద్దాడాలని వేచిచూస్తున్న నీవులేనిదే ఏ జీవి జీవించజాలదు అలా అని నీతోపాటు ఉండనూలేము నీ అస్తమయం నాకు అంధకారము నీ ఉదయం నాకు ఉత్సాహం నీతో పోటిపడాలని నిత్యం కలగంటూ.. నీకై ఎదురు చూసే నీ నేను - హనుమంత
Read More