యోధ ఎపిసోడ్ 8
యోధ ఎపిసోడ్ 8 వాష్ రూమ్లో వాటర్ కారుతున్న శబ్దంతో లేచింది గౌతమి. (అంటే స్పృహ కోల్పోయిన తర్వాత ఇప్పుడే తను స్పృహ లోకి వచ్చిందన్న మాట! ఈ మధ్యలో జరిగిందేది తనకి తెలీదు) అలా లేచిన గౌతమి చుట్టూ చూసింది. అంతా చీకటి వాతావరణం. ఉన్నట్టుండి ఆ వాటర్ కారుతున్న శబ్ధం కూడా ఆగిపోయింది. దీంతో భీతిల్లిన గౌతమి మొహం నిండా చెమటలు పడుతున్నాయి. "పార్ధు... గోపాల్... కృతి..." అంటూ గట్టిగా అరుస్తుంది గౌతమి.కానీ, ఎవరి దగ్గర నుండి రెస్పాన్స్ లేదు. మరింత గట్టిగా అరుస్తూ వాళ్ళని పిలుస్తుంది గౌతమి. అలా అరిచి అరిచి తన నోరు నొప్పెడితుంది తప్ప, ఎవరి దగ్గర నుండి ఉలుకూ పలుకూ లేదు. ఇంతలో ... "నువ్వెంత అరిచి ఘీ పెట్టుకున్నా నీ అరుపులు ఎవరికి వినపడవు. నిన్ను నా నుండి రక్షించడానికి రారు హా.. హాహ్హ... హాహ్హహ్హ..." అంటూ ఒక భయకరమైన పెద్ద శబ్ధం మగ వాయిస్ తో కూడి సరిగా…