యోధ ఎపిసోడ్ 9
యోధ ఎపిసోడ్ 9 ఆ రోజు గురువారం. ఎప్పటిలానే తెల్లారింది. పార్ధుకి మెలుకవ వచ్చింది. చుట్టూ చూసాడు. తను తన రూంలోనే ఉన్నాడు. బయట నుండి గంట శబ్ధం. అంతకుముందు రోజు జరిగిందంతా ఎప్పటిలానే తనకి గుర్తుకు వస్తుంది. అక్కడి నుండి వేగంగా గౌతమి రూం వైపు పరుగు తీశాడు. అందులో గౌతమి లేదు. అంతా చూసాడు కానీ, లాభం లేదు. బయటకు అంతే వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఈ సారి.. ప్రియ, అవేశ్ రూమ్స్ రెండూ డోర్స్ క్లోజ్ చేసి ఉన్నాయి. కృతి, గోపాల్, విశాల్ ల రూం డోర్స్ తడుతూ వాళ్ళని నిద్ర నుండి లేపుతూ బాల్కనీ లోకి పరుగుతీసాడు. ఎప్పటిలానే అక్కడ కూడా కాలుతున్న చితి. అంటే గౌతమి కూడా... అప్పటికే అక్కడికి చేరుకున్న వాళ్ల స్నేహితులతో పాటు పార్ధు దుఃఖానికి కూడా అవధుల్లేవ్... గౌతమి లేదన్న విషయం తెలిసి, గోపాల్ కి అయితే కోపం నాషాలాన్నింటింది. వాళ్ల…