తిరుమల గీతావళి
తిరుమల గీతావళి పల్లవి అండగ నిలిచేవాడిని ఏమని మే కోరెదెము కొండలపై ఉన్నవాడిని ఎంతని మే వేడెదెము చరణం దారే తెలియని వారము నిను చేరాలని వేచెదము నీవుంటే మాకు వేడుక అనుమానము లేనే లేదిక చరణం లేనివారికి నీవేగా ఉన్నవారికీ నీవేగా నీకృపనే కోరేవారికి ఇంకెవరు లేరుగా చరణం మాలోనే నీవుంటే ఏ భయము చేరదుగా గోవిందా అని పలికితిమా నీవే మమ్ము వెతికేవు చరణం నీ తలపే సాక్షిగా నిను చూసే భాగ్యానికి కన్నులు కాయలు కాచినవి కాలము పరిగెడుచున్నది -సి.యస్.రాంబాబు