akshralipi poems

చెప్పుడు మాటలు – ఆగని అసూయలు

చెప్పుడు మాటలు - ఆగని అసూయలు చెప్పుడు మాటలు చేతనైనంత చేటు చేస్తాయి చెవులకు ఇంపుగావుంటాయి కానీ నీడకి- నిజానికి తేడావలె చెప్పేవాళ్ళు ఆచరణకు ఆమడదూరంలో వుంటారు విశ్వాసానికి విఘాతంలా అనర్థాలకు అంతులేనిదారిలా కలహాలకు కారణంమై అవగాహన అసలే లేక ఆలోచించని వివేకంతో నిర్ధారణలేని నిర్ణయాలై అపార్థాల ఆజ్యంగా తప్పొప్పులు తారుమారై చిచ్చుల చిత్రాలుచూపిస్తూ అంతస్థుల అంతరాలుపెరిగి ఆగని అసూయలుగామారి ఆరోపణల అస్త్రాలుగా చేరి అపహస్యానికి దగ్గరగా చూసి సందేహాలే సమస్యలుగాతెచ్చి సరిదిద్దు కోలేని తప్పుగామారి జీవితాలను తలక్రిందులుగా మార్చి విలువైన సమయాన్ని కోల్పోయి వినడంమాత్రమే బలహీనతగా మారి మనశ్శాంతి కోల్పోయి అశాంతి మిగులుతుంది చెప్పుడు మాటలు చెప్పేవారి కంటే వినేవారికే నష్టం ఎక్కువ విన్నా పెడచెవిన పెట్టాలి కానీ పెడార్థాలుగా మారకుండాచూసుకోవడం మంచిదే కదా మరి అందరికీ.....? - జి జయ
Read More

బహుమతి

బహుమతి అమ్మా నీ ఋణాన్ని తీర్చకపోతే ఈ జన్మకు సార్థకత లేదు. నీ ఆశయం నీ కోరిక తప్పక నెరవేరుస్తామని నీ కల మా కలగా నీ కళ్ళు మా కళ్లుగా చేసుకుని ఈ లోకానికి మెమెంటో చూపించి తీరుతాం దాని కోసం మా ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధ పడతాం. అమ్మ తొందర్లోనే నీ కలను నీకు బహుమతిగా ఇస్తానని హామీ ఇస్తూ. మాతృ దినోత్సవ శుభాకాంక్షలు... - భవ్య
Read More