ame by kamesh

ఆమె

కులమతాలకు.....పరువు ప్రతిష్టలకి ఆ సమాజానికి....కన్నవాళ్ళ ప్రేమకి తలోంచి , నూరేళ్ళ తన ప్రేమని త్యాగం చేసి ఓ అపరిచితుడ్ని ఆమె మనువాడింది. ప్రతీ రాత్రి ఆమెకు కాళ రాత్రే..... ఆమె తనువుపై జెర్రెలు , తేళ్ళు పాకే జగుప్సాకర కాలరాత్రి. దిండుపై మోముని వాల్చి , నిప్పు కణికలులా కన్నీళ్ళు కురిసే కటిక కాలరాత్రి. ఆ రాత్రీ.... మదమెక్కిన ఆ పశువు , మందు సీసాతో ఆమెపై దుమికింది. మనసుని మాటల కొడవలితో కోసి ఆమె అంగంగాలని నెత్తుటిమయం చేసి ఏరులై పారుతున్న తన కన్నీటిని కడుపారా తాగి , తన దేహ దాహాన్ని తీర్చుకుంటుంది. ఆ మరుసటి రోజునే......, ఆ తడిసిన కళ్ళతో తనని కట్టబెట్టిన కన్నవాళ్ళ ఇంటి తలపు తట్టింది. ఆ కన్నీలని తుడుస్తారేమో అని...! కానీ..., వాళ్ళే రెండు కన్నీటి బొట్లని రాల్చి ఆమెను తిరిగి ఆ నరకానికి సాగనంపారు అలా ఒక్కో రాత్రి ఒక్కో యుగంలా…
Read More