amma nanna

అమ్మ – నాన్న

అమ్మ - నాన్న అడగందే అమ్మైనా పెట్టదు అంటారు కానీ అది తప్పు అండి, ఇంకా చాలు అమ్మా, వద్దు, వద్దు అని మొత్తుకున్నా కూడా కొసరి కొసరి పెట్టేదే అమ్మ, ఏమైనా అంటే నీకేం తెలీదు బడుద్ధాయ్ తిను అంటుంది. ఈ భూ ప్రపంచంలో అసలైన ప్రేమ అంటే తల్లిదే అని చెప్పచ్చు. ఎందుకంటే బిడ్డ కడుపులో పడ్డ క్షణం నుంచే ఎలా ఉంటుందో, అమ్మయా, అబ్బాయా, అని తెలుసుకోకుండానే ప్రేమిస్తుంది. పుట్టాకా లాలిస్తుంది, బిడ్డను ప్రసవించిన మొదటి రోజు నుంచి రేయి పగలు అని తేడా లేకుండా తన ప్రపంచాన్ని వదులుకొని బిడ్డే ప్రపంచం అన్నట్టు బతుకుతుంది. కళ్ళలో పెట్టుకొని చూసుకుంటుంది. గుండెల్లో దాచుకొని మురిసిపోతుంది. బిడ్డకు ఎదైనా కష్టం వస్తే తల్లడిల్లిపోతుంది. ఎలా ఉండాలో చెబుతుంది. ఎలా ఉండకూడదో నేర్పుతుంది. ఇక నాన్న బిడ్డ కడుపులో పడింది అని తెలియగానే అత్యంత సంతోషపడే వ్యక్తి. అమ్మ తర్వాత…
Read More