అమ్మాయి జీవితం
అమ్మాయి జీవితం అమ్మాయి పుడితే పూర్వకాలం లో మహా లక్ష్మి అనేవారు. కాలం మారుతున్న కొద్ది అమ్మాయిలు పుట్టడం భారంగా అనుకున్నారు. తర్వాత కాలం లో ఆడపిల్ల అంటే ఆడ పిల్లే ఇడ పిల్ల కాదనే ఒక నమ్మకం లోకి వచ్ఛారు. తర్వాత కాలం లో ఆడపిల్ల అనగానే కడుపులోనే చంపడం చేశారు. ఇంకా కాలం మారుతున్న కొద్దీ ఆడపిల్లను చదివించడం, చదివించిన వారికి తగిన సంభంధాలు చూడడం భారంగా భావించారు. అందుకే అమ్మాయిలను ఇంటి వరకే పరిమితం చేశారు. కాలం మారుతున్న కొద్దీ మనుషుల్లో ఆలోచనలు కొత్త దారులు వెతికాయి. దీనికి కారణం అమ్మాయిలను తక్కువ అంచనా వేసిన తర్వాత అమ్మాయిలు సాధించిన విజయాలు చూసిన వారు అమ్మాయిల గురించి అలోచించి వారిని చదివించడం, తర్వాత ఉద్యోగానికి పంపడం చేశారు. వారికి స్వేచ్చని ఇస్తున్నాం అంటున్నారు. కొడుకుతో పాటు చూస్తున్నాం అని అనుకుంటూ నలుగురికీ చెప్పుకుంటున్నారు. కానీ ఇక్కడ ఒక…