అమ్మాయి మనసు
అమ్మాయి మనసు మధు మాసం "... నిండు చందమామ ఆహ్లాదకరమైన వెన్నెలను విరజిమ్ముతోంది. రకరకాల పూల మొక్కలతో కూడిన ఆ అందమైన తోటలో ప్రత్యేకించి ఏర్పాటు చేసుకున్న ఊయలలో శ్వేత వర్ణంలో ఉన్న సుతిమెత్తని దిండుకి చేరగిలపడి చేతిలోని కప్పులోంచి ఫిల్టర్ కాఫీని ఒక్కొక్క సిప్ ఆస్వాదిస్తూ తాగుతూ ఒక రకమైన పారవశ్యంలో మునిగితేలుతోంది అనుపమ. పిండారబోసినట్లుగా ఉన్నా ఆహ్లాదకరమైన వెన్నెల వెలుగులో ఏకాంతంగా ఆలోచనాతరంగాలలో తేలిపోతూ గడపడం అంటే అనుపమకి చాలా ఇష్టం. అందుకనే తనకు జాబ్ రాగానే మంచి లొకేషన్లో చిన్న ఇల్లు నిర్మించుకుని, తన అభిరుచికి అనుగుణంగా తీర్చిదిద్దుకుంది. ఇంటి చుట్టూ చక్కని గార్డెన్ ను ఏర్పాటు చేసుకుంది. అనుపమ మంచి చదువరే కాకుండా మంచి రచయిత్రి కూడా. సాయంత్రం ఇంటికి రాగానే పనులన్నీ ముగించుకొని పుస్తకము, పేపర్లు, కలమూ తీసుకుని గార్డెన్ లోకి చేరిపోతుంది. అనుపమ కలం నుండి వెలువడిన ప్రతి రచనకు ఆ పండువెన్నెల్లోనే,…