అందమైన ఆకాశం
అందమైన ఆకాశం అందమైన ఆకాశంలో అందరాని చంద్రుడు అతన్ని అందుకోవాలనుకోవడం అత్యాశ అయినా, అందితే బాగుండు అనే కోరిక దహించి వేస్తుంది. నిన్న అయినా పున్నమి రాత్రిలో ఒంటరిగా నీతో ఊసులాడాలని నా మదిలోని మాటలు ఎన్నో చెప్పాలని, నా హృదయాన్ని అంతా నీ ముందు పరచాలని అనుకుంటాను. కానీ అదేంటో నన్ను చూడగానే నువ్వు మబ్బుల చాటుకు జారుకుంటావు. నా హృదయాన్ని పరిస్తే కరిగిపోయి కిందికి వస్తానేమోనని నీ భయం కాబోలు... అందుకే మెల్లిగా మబ్బుల చాటుకు దాక్కొని నన్ను ఏడిపిస్తావు, అయినా వదులుతానా నా అక్షరాలని కవనాలుగా మారలుగా కూర్చి గుచ్చి, ఇదిగో ఇలా నీ ముందు పరుస్తున్నా... కనీసం అక్షరాలు అయినా చూసి నా మది మాటలు తెలుసుకుంటావని ఆశతో ఇప్పటికి శుభరాత్రి చెప్తూ రేపటికి నిన్ను స్వాగతిస్తున్నా.. - భవ్య చారు