anuraagam

అనురాగం

అనురాగం అమ్మా నేనోచ్చేసాను అంటూ లోపలికి అడుగు పెట్టిన ప్రీతి అక్కడ ఇంట్లో ఉన్న కొత్తవారిని చూసి ఆగిపోయింది. ఏంటమ్మా అలా ఆగిపోయావు. పర్లేదు రా లోపలికి వీళ్ళు మన దూరపు బంధువులే అమ్మా, అంటూ తండ్రి దశరథ్ ప్రీతి దగ్గరగా వచ్చాడు భుజం పై చేయి వేసి ఇదిగోరా నరేందర్ ఇదే నా ఒక్కగానొక్క కూతురు ప్రీతి, ఇక్కడే కాలేజీ లో డిగ్రీ చివరి సంవత్సరం చదువుతుంది అంటూ అమల అమ్మాయిని తీసుకుని వెళ్ళు అన్నాడు. రామ్మా ప్రీతీ అంటూ తల్లి అమల ప్రీతి ని తీసుకుని లోపలికి వెళ్ళింది. ఆ కాసేపట్లోనే ప్రీతికి అర్థమైంది అవి పెళ్లిచూపులు అని. తాను ఇప్పుడే పెళ్లి చేసుకోనని డిగ్రీ అయిపోయి ఏదైనా ఉద్యోగం చేస్తాను అని తల్లితో ఎప్పుడో చెప్పింది అయినా మళ్ళీ ఇలా పెళ్లి చూపులు ఎందుకు అరేంజ్ చేశారో నాన్నగారు అని అనుకుంటూ వంటింట్లోకి వెళ్లి తల్లితో ఏంటమ్మా…
Read More