anveshana episode 4 by bharadwaj

అన్వేషణ ఎపిసోడ్ 4

అన్వేషణ ఎపిసోడ్ 4 అలా నేను, సత్య కృష్ణ ఆ డైరీని ఇంటికి తీసుకొచ్చి, మొదటి పేజీ నుండి దానిని చదవడం ప్రారంభించాము.  "ఎప్పుడూ నా స్నేహితుల దగ్గర ఏ విషయం దాచకుండా ప్రతీ విషయాన్ని వాళ్ళతో పంచుకునే నేను, తన గురించి విషయం దాచి చాలా పెద్ద తప్పు చేశాననిపిస్తుంది. కొన్ని కోట్ల కలలతో, లక్షల ఆశలతో IES అవ్వాలనే లక్ష్యంతో ఇంజనీరింగ్ లో చేరిన నాకు, ఎప్పటిలాగే నా చదువు, ఏకాగ్రతతో తప్ప మరే ధ్యాస లేకుండా సాగిపోతుంది. అప్పటికే రెండున్నరేళ్ల గడిచాయి. ఇంకొక సంవత్సరం ఇలాగే కష్టపడితే, రాబోయే అల్ ఇండియా గేట్ పరీక్షలో మంచి మార్కులు సాధించి, నా లక్ష్యాన్ని చేరుకోవచ్చని ఉవ్విళ్లూరుతున్న రోజులవి. అలా సాఫీగా సాగిపోతున్న నా జీవితంలోకి తను వచ్చింది. ఆ రోజు తెలియలేదు నాకు, తన స్వార్థానికి నా జీవితం నాశనమైపోతుందని. తన పేరు సంధ్య. ఇంజనీరింగ్లో ఇద్దరం క్లాస్మేట్స్. అప్పటికే కాలేజ్…
Read More