anveshi aksharalipi

అంతా అంతే!

అంతా అంతే! కాలంతో పాటు కాకినాడ మారినట్టే జ్ఞాపకాలూ మారిపోతాయి భావనారాయణుడి గుళ్ళో నిశ్చింతగా గూడు కట్టిన పక్షులు వరి కంకుల కోసం పోయి పోయి వరదలో చిక్కుకున్నట్టు - అంతా అంతే! వెక్కిరించాడంటే సమాజాన్ని వెంకటచలానిదా తప్పు! నేరేడు చెట్టు కింద పళ్ళేరుకుందికి పందెం వేసుకుని పరుగులు పెట్టిన కాలేజీ అమ్మాయిలు ఎందరో నవ్వులన్నీ ఇగిరి పోయి ఉప్పుమళ్ళై పేలిపోయి వంట రుచుల్లో కరిగిపోయారు. వెయ్యగా వెయ్యగా గులకరాళ్ళు నీళ్ళెప్పటికో పైకొస్తాయని వెతుకుతూ వెతుకుతూ వెర్రి కాకులమై ఎండ పడ్డ కలలతో ఎంత దాహంతో ఉన్నాం! ఏమై పోతున్నాం! మామిడి తోటలొదిలేసి ఇసక మేటలొదిలేసి ఓ అయ్య చేతిలో పెట్టి ఇల్లు కట్టుకోమన్నారని కదా ఇంత దూరాలొచ్చేసాం ఏం చేస్తున్నారంటే పిల్లలతో గిన్నెలతో మారు మాత్రం ఏం చెప్తార్లెండి! మన ఆశలు కాలవగట్టు పొలాలు కావుగా ఏటి పొడవుతా పచ్చగా ఏదో ఒకటి పండటానికి! మరెలాగంటే చెప్పలేం. పొడుపు కథలు…
Read More

అన్వేషి

అన్వేషి వెతుకుతుంటాను నిరంతరం మానవనాగరికత బాటవేసిన మనిషిని! పరిమళమై వ్యాపించిన మానవత్వాన్ని! పురాతన మనుషులు వారంతా వెక్కిరించాడొక మిత్రుడు! మారుతున్న కాలంతో మారని మనిషికి నువ్వంటు భృకుటి విరిచాడు! కాల ప్రవాహానికి కదిలిపోవటమే తెలుసు మారటం మార్చడం మనిషి చేసే పని కదాని నిట్టూర్చాను! కాలాన్ని వెనక్కి తిప్పలేనట్టే మార్పు చూపును తిప్పలేము రెండూ సాగిపోతుంటాయి! రెప్పలార్పుతు మనిషి మాత్రం అవసరాన్ని ఆసరా చేసుకుని అధికారం చెలాయిస్తాడు! నిరీశ్వరవాదంలా నీది నిరాశావాదం అన్నాడు మళ్ళీ మిత్రుడు! వెనక్కిలాగే మనసును ముందుకు నడిపించలేని మీరంతా ముందుచూపులేనివారేనంటూ దెప్పిపొడిచాడు! నిలువెల్లా కప్పేసిన సాంకేతికత యాంత్రికతను గుమ్మరించేయగా మనిషితనంతో నవనవలాడే మనిషి కనబడలేదని దిగులు మేఘమై కూలబడకని వచ్చే వాతావరణ హెచ్చరిక మనిషిని మార్చే ఋతుపవనాలను వెంటతెస్తుందన్న ఆశ నన్నో నిరంతర అన్వేషిని చేసిందని చెప్పాలని ఉన్నా చెప్పక తప్పుకున్నాను తప్పు తెలుసుకుంటాడన్న ఆశను నింపుకుంటూ! - సి. యస్. రాంబాబు
Read More