bandham aksharalipi

బంధం

బంధం   చెట్టుకు పూసిన పూలతో అనుబంధం పూటని తెలిసినా, పరిమళం వెదజల్లుతూ నవ్వుతూ ఉన్న పూలను చిగురుల చేతులతో తడిమి, కొమ్మల ఊయలూపి, మొగ్గల బుగ్గలుగీటి, తేనె ఉగ్గులు పోసి, ఎండిన ఆకులతో దిష్టి తీసి మురిసే చెట్టుకే తెలుసు జన్మల బంధం అంటే ఏమిటో.... తీరచెలిని చూచుటకు చెంగు చెంగున ఎగురుతూ, ఉత్సాహంగా ఉవ్వెత్తున ఎగసి ఉరకలు వేస్తూ, కెరటాల కౌగిలిలో కరిగించే సంద్రానికి తెలుసు అనుబంధం అంటే ఏమిటో.... గూటిలో గులాబీ రంగు వర్ణంలో నోరు తెరిచి ఎదురుచూసే పక్షి పిల్ల నోటిలో రోజంతా తిరిగి సేకరించిన ధాన్యపు పాలను పోసి రెక్కలతో పొదువుకునే పక్షికి తెలుసు జన్మల బంధం అంటే ఏమిటో... సూర్య,చంద్రుల కళ్ళతో పగలు, రాత్రి కంటికి రెప్పలా కాస్తూ, వలపు వాన చినుకులతో చుంబించి పుడమిని పులకింపచేసి సంబరపడే అంబరానికే తెలుసు బంధం అంటే ఏమిటో.... తాను ఎంత స్వేచ్ఛగా ఎగిరినా, తనని…
Read More

బంధం

బంధం మనసుతో ముడిపడి ఉంటాయి కొన్ని బంధాలు.. ఎప్పుడు చూడని చవిచూడని అభిరుచులు కలిసినప్పుడు.. ప్రేమ అనుభూతికి లోనయినపుడు.. ఆ బంధాలు విడిపోతే మనసుకు కష్టంగా ఉంటుంది...   - పలుకూరి
Read More

బంధం

బంధం సృష్టిలో ప్రతీ ప్రాణికి  ఏదో రూపంలో, ఎవరితో ఒకరితో బంధం ఏర్పడుతుంది. అన్ని ప్రాణులకన్నా, మానవ జన్మకు ఎక్కువ బంధాలు కలిగి వున్నాయి. మనిషి ప్రకృతితో, పశువులతో, పక్షులతో,  మనుషులతో, జంతువులతో, జలచరాలతో కూడా బంధం ఏర్పరచుకున్నాడు. కానీ, మనిషికి అంత్యంత అమూల్యమైన బంధమైన తనతో తాను బంధం చేసుకోవడంలో నేటి మానవుడు విఫలమవుతున్నాడు. మనిషిగా అన్నీ బంధాలతో అన్యోన్యంగా వుండే ముందు, తన అంతరంగంతో, తన ఆత్మతో బంధం ఏర్పరచుకోవాలి. అప్పుడే, మానవుడు ఎన్ని బంధాలనైనా కలుపోగలుగుతాడు. కలిసి జీవించగలుగుతాడు.  స్వార్ధానికి చోటు లేని, త్యాగానికి చిరునామాగా నిలిచి, వాస్తవంలో బతకాలనే ఆలోచనలతో, పరిస్థితులను సానుకూల దృక్పథంతో తీసుకునే బాధ్యత గలిన వ్యక్తులు, తనతో తాను బంధం కలిగిన మనసున్న మనుషులు తృప్తికరమైన జీవితాన్ని ఆస్వాదిస్తారు. -బి రాధిక
Read More