చిలిపి పనులు
చిలిపి పనులు ఏంటి నిద్ర రావడం లేదా అడిగింది అమ్మ. లేదమ్మా రావడం లేదు. నిద్ర రాకున్నా కళ్ళు మూసుకో అదే వస్తుంది. లేకపోతే రేపు అక్కడ నిద్ర పోతావు. నీ ఇష్టం ఇక అంటూ బెదిరించింది ప్రేమగా, అవును పడుకోవాలి లేదంటే తెల్లారి సంతోషంగా ఉండలేను అనుకుంటూ గట్టిగా కళ్ళు మూసుకున్నా అయినా నిద్ర రాదే, రేపెలా వెళ్తానో, ఎలా మాట్లాడాలో, ఎలా గుర్తు పట్టాలో, అసలు నన్ను గుర్తు పడతారా లేదా అనే లక్ష ప్రశ్నల మధ్య నిద్ర అనే చిన్న విషయం మరుగున పడింది. అంతకు ముందు ఏం బట్టలు వేసుకోవాలి, ఏం చెప్పులు వేసుకోవాలి అంటూ హడావుడి పడుతూ అన్నీ సిద్దం చేసుకునే సరికి పదకొండు, అయ్యింది. ఆ తర్వాత మొదలైంది అసలు ఆలోచన ఎలా మాట్లాడాలి అనుకుంటూ గుండెల్లో ఉన్న సంతోషం కళ్ళలో కనిపిస్తుంటే కళ్ళు మూతలు పడకుండా ఆలోచనలు గతం వైపు పరుగులు…