క్రిస్టమస్
క్రిస్టమస్ నకిలీపురం నుండి నా చెల్లెలు "నీ కూతురిని చూడాలనిపించింది తీసుకునిరా అన్నయ్యా అని కబురుపెడితే”. నేను, నా ముద్దుల కూతురు ఇద్దరము వెళ్ళాము. బస్టాండు నుండి ఒక కిలోమీటర్ దూరం నడుచుకుంటూ వెళ్ళాలి వాళ్ళింటికి. పాపని భుజాలమీద ఎక్కించుకొని బయలుదేరాను. వీది నిండా లైట్లు, భక్తి పాటలు, ప్రార్థనలతో హోరెత్తుతోంది. పాప ఆ పండుగను చూసి ఎంతో ఆతృతగా ప్రశ్నలు అడుగుతోంది. ఎండ ఎక్కువుగా ఉండటం వల్ల నేను ఏమీ చెప్పలేక పోయా. అక్కడున్న ఐస్క్రీమ్, బాంబే మిఠాయి తింటూ శాంటాక్లాస్, క్రిస్మస్ ట్రీ, మొదలగువాటిని ఆస్వాదిస్తూ నిద్రపోయింది. ఇంటికి వచ్చి అందర్నీ పలకరించి, చుట్టాలు ఇంటికి పోయివచ్చినా గానీ పాప ఇంకా లేవలేదు. టైమ్ 5 గంటలయింది పాపని నిద్ర లేపి స్నానం చేయించి, వంటా వార్పు కార్యక్రమాలు చేసేటప్పటికి 7:30 నిమిషాలయింది మా చెల్లికి. ఇంట్లో వాళ్ళతో కలిసి భోజనం చేసి ఆరుబయట నులక మంచ మేసుకొనో…