detective epidoe 5 aksharalipi

డిటెక్టివ్ ఎపిసోడ్ 5

డిటెక్టివ్ ఎపిసోడ్ 5 వాళ్ళ మధ్య టేబుల్ మీద కాఫీ పొగలు కక్కుతూ వుంది. "మై డియర్ యంగ్ మోస్ట్ బ్యూటిఫుల్ ఆఫీసర్ ఇప్పుడు చెప్పండి.. నన్నెండుకు అరెస్ట్ చేసారో? సుగాత్రి వంక చూసి అన్నాడు "చిన్న కరెక్షన్ మిస్టర్ జీనియస్ డిటెక్టివ్ సిద్దార్థగారు.. మిమ్మల్ని అరెస్ట్ చేయలేదు.. వాక్యం బావుందని 'యు అర్ అండర్ అరెస్ట్" అన్నంత మాత్రాన అరెస్ట్ కావడానికి డిటెక్టివ్ సిద్దార్థ అమాయకుడు కాదు... మా ఫ్రెండ్ మీలాంటి వాళ్లకు ఓ మంచిపేరు పెట్టింది... మాయకులు..." నవ్వుతూ అంది సుగాత్రి. కాఫీ కప్పును సిద్దార్థ చేతికి ఇస్తూ... "నేనా... ఆల్చిప్పల్లాంటి కళ్ళు ఉన్న వాళ్లకు ట్రైలర్ మేడ్ తెలివితేటలుంటాయని ఎక్కడో విన్నాను" అంటూ కాఫీ కప్పు అందుకుని కాఫీ స్మెల్ చూస్తూ 'ఫిల్టర్ కాఫీ అయితే బావుండేది” అన్నాడు. "మీకోసం నేర్చుకుంటాను" అనాలనుకుంది.. కానీ అప్పటికే కేబిన్ బయట మిగితా ఆఫీసర్స్ వున్నారు. "మనం ఇప్పుడు నిజాలు…
Read More