ఈ జీవన ప్రయాణం ఎందాకో,,,,!
ఈ జీవన ప్రయాణం ఎందాకో,,,,! ఒకప్పుడు నారుపోసిన వాడు నీరుపోయడా అనిదంపతులు ఏడెనిమిది మంది నుండి డజను మంది దాకా సంతానం కనేవారు,,,,,,అప్పుడు కరువు కాటకాలు ఆకలి బాధలు,రోగాలు దేశంలో పెచ్చరిల్లుతున్న రోజులుజనాభ హద్దులు మీరి పెరుగుతున్న దినాలు,,,,,,,పందొమ్మిది వందల డెబ్భై ఐదు దశకంలోప్రభుత్వం తేరుకుని బలవంతంగా కుటుంబ నియంత్రణ సర్జరీలు ముఖ్యంగా మగవాళ్ళకు చేసింది,,,,,,ఇద్దరు లేక ముగ్గురు సంతానం చాలు అని సామాజిక మీడియాల్లో విస్తృత ప్రచారం చేసింది,,,,,,,కొన్నాళ్ళకు జనజీవితాల్లో కనువిప్పు కలిగి మహోజ్వల మార్పు వచ్చింది ఆ రోజుల్లో,,,,,అదే మార్పు తర్వాత తర్వాత ఒక్కరు ముద్దు ఇద్దరు హద్దు అనే నైజం మనుష్యుల్లో సమూల మార్పుకు దోహదం చేసింది,,,,,,,నవీన యువత భార్యాభర్తలు ఇరువురు ఉద్యోగాలు, ఊడిగాలు బిజీబిజీగా చేస్తున్న రోజులివి,,,,,పిల్లల పెంపకం భారంగా మారిన రోజులివి, మహిళలు పిల్లలు కనే ఓపిక, సహనం నశించిపోయింది,,,,,జపాన్, చైనాలోలా అసలే వద్దు ,ఒక్కరు ముద్దు అనే నానుడి మన దేశంలో పొడచూపుతోంది,,,,,,కాని…