gaayam

గాయం

గాయం బాధను దాచిన మొహానికి నవ్వును అద్ది కిరణాన్ని అడిగాను నీ వెలుగుకు కారణమేమని జీవించాలనే కోరిక అంది ఈసారి నక్షత్రాలను అడిగాను ఆకాశంలో తారలెలా అయ్యారని బతికిన క్షణాలను దాచుకోవటంతో అన్నాయి తేరిపారచూస్తూ ఆకాశాన్నడిగాను తనువంతా శూన్యమేగా, బాధలేదా! మేలుచేసే సూరీడు వెంటే ఉంటే శూన్యమైనా వెలుగు తోటే అంది తనువంతా చీకటి గాయాలని వగచేవేందుకు నన్నడిగాయన్నీ! గాయాలను ఆశతో కడిగేయన్నాయ్ అని ఫక్కున నవ్వాయ్ కలచెదిరింది.. ఉదయం విచ్చుకుంది.. - సి.యస్.రాంబాబు
Read More

గాయం

గాయం అయ్యో అప్పుడే వెళ్లి పోయావా ఏమంత తొందర వచ్చిందని వెళ్ళావు మీతో ఎన్నో మాట్లాడాలని అనుకున్నానే మీతో ఎన్నో పనులు చేయించాలని అనుకున్నా నే ఎన్నో కబుర్లు చెప్పాలని అనుకున్నాం ఆ కబుర్ల లో నుండి అక్షర పదాలను కలుపుతూ మీలోని ఆవేశాన్ని బయటకు ఇంకా ఇంకా తేవాలని అనుకున్నా నే కదులుతున్న కాలం తీరు లను నిగ్గు తేల్చేందుకు , సిగ్గు లేని సమాజాన్ని మార్చేందుకు మీ మా అక్షరాల నీరాజనం జనాలకు అందించాలని అనుకున్నానే మీ తరాలన్ని ముందు తరాలకు ఆదర్శం కావటానికి మీతో కలిసి పని చేయాలని అనుకున్న నా ఆశలన్నీ ఆవిరి అయ్యేలా కాలం ఒక్క క్షణకాలం స్తంభించెలా చేసావే అవ్వన్నీ అవ్వక ముందే ... అందరికన్నా ముందే ఏమంత తొందర పడ్డావు , అవును లే మమల్ని మీరు ఒక్కసారి అయినా చూస్తే కదా తెలిసేది మేమనుకున్నవన్ని మీరు వింటే కదా మా…
Read More