gogula narayana poem aksharalipi

మధ్య తరగతి మనిషి

మధ్య తరగతి మనిషి ఎన్నో ఆశలతో రోజును మొదలెట్టి చివరికి అదే రోజు నిద్ర సమయానికి నిరాశతో ముగిస్తూ మరలా ఓ చిన్న ఆశతో పోగుచేసుకుంటు రోజులను సాగదీస్తూ ముందుకు వెళుతుంటాడు... ఎన్ని సమస్యలు చుట్టుముట్టిన అన్నింటా మొక్కవోని పట్టుదలతో ఆ సమస్యలను ఒక్కోసారి పరిష్కరించుకుంటు మరో ప్రయత్నంలో వాటిలో కూరుకుపోతు జీవితాన్ని వెల్లదిస్తుంటాడు... సమాజపు వెక్కిరింపులను... బంధువుల చీత్కారాలను... అన్నింటినీ భరిస్తూ ఓ నాటికి తన విజయానికి ఉపయోగించుకుంటు తనని తాను నిలబెట్టుకుంటు ఓ ప్రక్క కుటుంబాన్ని నిలబెడుతూ... తన ప్రయాణాన్ని తాను కొనసాగిస్తాడు... - ఇట్లు ఓ మధ్య తరగతి మనిషి (గోగుల నారాయణ)
Read More

ఆశ

ఆశ రేపటి స్వప్నం... నిన్నటి గతం... గతించిన కాలానికి ఆయువు... రాబోవు కాలానికి ఆయుధం... నిరాశ నిస్పృహలకు చెరమగీతం పాడేది... ధైర్యానికి పట్టుకొమ్మ... ఎన్నాళ్ళో వేచిన సమయానికి ముగింపు... జీవుని జీవాన్ని నిలబెట్టేది... మానసిక సంఘర్షణలకు నెలవు... మనిషికీ ఊతం... నిరాశలను తరిమికొడుతుంది... జీవితాన్ని నిలబెడుతుంది... - గోగుల నారాయణ
Read More

బంధం

బంధం బంధం ఆప్యాయతల హరివిల్లు బంధం... మమతలకు నిలయం బంధం... ఏ బంధానికి అయినా ఆధారం నమ్మకం... ఉమ్మడి కుటుంబాలకి మొదటిమెట్టు బంధం... ఉమ్మడికుటుంబాలకు వ్యష్టి కుటుంబాలకు నెలవు బంధం... ఆ నమ్మకం ఎంత బలంగా ఉంటే బంధం అంత దృఢంగా ఉంటుంది... ఏ బంధాన్ని అయినా అస్థిర పరచేది ఓ చిన్న అపనమ్మకం... ఏ బంధం అయినా బలంగా పరిపుష్టిగా ఉండాలంటే అపనమ్మకాలకీ అపార్థాలకీ తావుండకూడదు... ఉమ్మడి కుటుంబాల్లో పెరిగిన వారికి ఎక్కువగా బంధాల విలువ తెలుస్తుంది... ఏ బంధాన్ని అయిన నిలబెట్టుకునేలా ప్రవర్తన నిర్దేశిస్తుంది... ఆ ప్రవర్తన సరైన క్రమంలో ఉంటే బంధం కూడా బలంగా ఉంటుంది...   - గోగుల నారాయణ
Read More