guvvala janta by palkuri

గువ్వల జంట

గువ్వల జంట నాలో నీవు నీలో నేను లీనం కావాలంటే కలలు కలలు కన్నాము మన ఇద్దరమూ ఒకటి అవ్వాలని.. అది ఏ నాటి కోరికో ఈనాటికీ తీరబోతున్నదని... నేననుకున్నా.. కానీ నేననుకున్నది నా రాణి ఆ వాణి వినిపిస్తుందా.. కనిపిస్తూ చేతి వేళ్ళ మధ్య పువ్వును చూపిస్తూ... ఆ కనుల నన్ను చూస్తూ ప్రేమతో ఇస్తుందా.. నా గుండెల నిండా అనురాగం నీవే నా రాణిగా కొలువై ఉన్నావు.. తోడుగా కలకాలం కలిసి పోతామా ఇలలో మనమిద్దరం... ఈ నేలను మురిపిద్దామ వలపుల పంటగా... నీ కంట కన్నీరు నాకు గిట్టదు.. ఓట్టుగా నీకు చెబుతున్నా... ఆ కంట కన్నీరు కారనివ్వను.. ఒంటరి నీవు కాదు నీ తోడుగా నేనున్నాను... నాలో నీవు నీలో నేను ఒకటైనాక... మన ఇద్దరికీ తిరిగే మున్నది... గువ్వల జంటగా గగన మండలం విహరిద్దామా... ముద్దుల జంటగా.. - పలుకూరి
Read More