hanumantha aksharalipi

నిస్సహాయత

నిస్సహాయత మధ్యతరగతి చిక్కుల్లో నిరాశ, నిస్సహాయతలో అలల్లా ఎగసే ఆలోచనలలో అణుగారిన బతుకుల్లో మిగిలే అంతరంగ మథనం వృద్దాప్యంలో ఆదరించని పుత్రుని ఆదయవ్యయాలను ఆకలింపుచేసే మనసులో మిగిలే అంతరంగ మథనం కని, పెంచి పోషించి స్కూల్ కి పంపడానికి వెనుకాడే ఆడపిల్లని మెట్టినింటికి వెళ్ళినప్పుడు కలిగే అంతరంగ మథనం బాధ్యతలు ఎరుగని తండ్రి బిడ్డ రోడ్డున పడ్డపుడు చుట్టాలు చీదరించినపుడు కలిగే అంతరంగ మథనం చదువుకునే రోజుల్లో శ్రద్దలేక పనిచేసే వయస్సులో బాధ్యతలేక ఇబ్బంది కలిగినపుడు అమ్మనాన గుర్తొస్తే కలిగే అంతరంగ మథనం - హనుమంత
Read More

మార్పు

మార్పు అనుకోకుండా ఒకరోజు నాలోని కవిత్వం పత్రికలో ముద్రితమైతే!... అనుకోకుండా ఒకరోజు ఆ పత్రిక నువ్వ తిరగేస్తే!.. అనుకోకుండా ఒకరోజు భావాలు నీ మనసుని తాకితే!... దొంగకు బంగారం దొరికి నట్లే వేటగాడి ఆహారం దొరికినట్లే గాలంలో చేపలు పడినట్లే అనుకోకుండా ఒకరోజు ఆ కవిత్వం నుండి ప్రేరణ పొందితే!... అనుకోకుండా ఒకరోజు ప్రేరణ ఆచరణలో పెడితే!... అనుకోకుండా ఒకరోజు మునుపటి కన్నా ఉత్తమం అనిపిస్తే!.... ప్రపంచానికి నువ్వు పరిచయం అయినట్లే నీ వాళ్లకు నువ్వు దగ్గరైనట్లే విజయకేతనం ఎగర వేసినట్లే - హనుమంత
Read More