ismail bhai

శ్రావణ సంధ్య

శ్రావణ సంధ్య రాజేశ్వర్రావ్ ఆ ఊర్లో పెద్ద జమిందార్. ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు. ఆడపిల్లలకి పెద్ద చదువులెందుకు అనుకునే పాతకాలం మనస్తత్వం. కొడుకుని కూడా అలాగే పెంచాడు. ఏదడిగినా కాదనకుండా ఇచ్చే తండ్రి అండతో డిగ్రీ కూడా పూర్తి చేయకుండా, ఉన్న ఆస్థి అంతా ఖర్చుపెడుతూ తిరిగాడు కొడుకు సురేష్.  పెద్ద కూతురు శ్రావణి తండ్రి మాట వింటూ పెద్దగా చదువుకోకుండా ఇంట్లోనే ఉంటుంది. చిన్న కూతురు సంధ్యకి చదువంటే ఇష్టం. కానీ తండ్రి సహకరించలేదు. తండ్రికి తెలీకుండా డిస్టన్స్ లో చదివి మంచి మార్కులతో డిగ్రీ పూర్తిచేసింది సంధ్య. బంధువులు చేసిన మోసాలు, కొడుకు జల్సాలు అన్నీ కలిసి ఆస్థి మొత్తం కరిగిపోయింది. కార్లు, బంగ్లాలు పోయాయి. ఒక చిన్న ఇంట్లో రెంట్ కి ఉంటున్నారు. పెద్ద కూతురుకి పెళ్ళి వయసు దాటుతున్నా సంబంధాలు రావటం లేదు. కొడుకుతో వ్యాపారం చేయిద్దామంటే పెట్టుబడికి పైసా లేదు. పెద్ద ఉద్యోగం చేయటానికి చదువు లేదు.…
Read More

అతిథి 

అతిథి ఈశ్వర్ ముప్పై అయిదేళ్ళుగా సౌదీలో ఉద్యోగం చేస్తున్నాడు. రెండు, మూడేళ్ళకి ఒకసారి ఒక వారం సొంత ఊరికి వచ్చేవాడు. ఎప్పుడో ఒకసారి రావటం వలన అందరినీ కలిసే సరికి ఆ వారం రోజులు ఇట్టే గడిచిపోయేవి. భార్య, ఇద్దరు పిల్లలతో ఎక్కువగా టైం స్పెండ్ చేయలేకపోతున్నాననే బాధ లోపల ఉన్నా, ఇదంతా వారి భవిష్యత్తు కోసమే కదా అని సరిపెట్టుకునేవాడు.  రిటైర్మెంట్ వయసు దగ్గర పడుతుండగా, ఇంక ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా కుటుంబంతో ఉండాలనుకుని, ఇంటికి వచ్చేసాడు. ఇంట్లో వాళ్ళని సరదాగా ఆటపట్టిద్దామని, ఒకటి రెండు రోజులు చాలా స్ట్రిక్ట్ గా ఉన్నట్టు నటించి, తర్వాత నవ్విద్దామని అనుకున్నాడు. తన ఎక్షైట్మెంట్ అంతా దాచిపెట్టి నటించాడు. భార్య ఏం వండినా, ఏం చేసినా వంక పెట్టాడు, బాలేదని విసుక్కున్నాడు. కొడుకు స్నేహితులతో కలిసి బైటకి వెళ్ళి రాత్రి ఆలస్యంగా ఇంటికి వస్తే కసురుకున్నాడు. ఇంక నుండి రాత్రి తిరుగుళ్ళు మానేయాలని గట్టిగా చెప్పాడు. కూతురు…
Read More