jatha by bhavya charu

జత

జత నీ జతగా నేనుండాలని ఎన్నో కలలు కన్నాను మన జత జంటను చూసి జనాలు నవ్వుకున్నా పట్టించుకోలేదు నాకు నువ్వు నీకు నేను అంటూ జత కలిసి పోయాను సమాజం ఛీదరించినా ఒక్కటై నిలిచింది మన జత నలుగురికి ఆదర్శం కావాలనుకున్నా మనసులో జత కట్టవని మురిసి పోయారు నాతో జత కలిపిన నువ్వు కొన్నాళ్ళు బాగానే ఉన్నాక నాలో లోపాలు వెతికావు మన బంధాన్ని మర్చిపోయావా ఇంకొక మంచి జతను మరిగి నా జత విడిచి వెళ్ళావు గువ్వల జంటలా ఉండాలనుకున్నాం కానీ ఇంకో గువ్వను పరిచయం చేసుకోని నన్ను నా జతను వదిలేసి పోయావు. జతకున్న అర్థాన్ని మర్చావు. జత లేని నా బతుకుని అగాధం లోకి నెట్టావు. ఈ జతలేని బతికేందుకు  ఒక పావురాయి చనిపోతే వేరొక పావురాయి ఇంకో తోడును వేతుక్కోదు. అది కూడా చనిపోతుంది ఇక ఆ జంట పావురాల జీవితం వ్యర్థం…
Read More