jeevavaividyam

జీవవైవిద్యము

జీవవైవిద్యము

జీవవైవిద్యము "ఏమండీ రేపటి ప్రోగ్రాం గుర్తుంది కదా!" పడుకునే ముందు ఉమాపతికి గుర్తు చేసింది భార్య జయంతి. "అన్నీ మనం అనుకున్నట్లే జరగాలి. నాకు బాగానే గుర్తుంది. నువ్వు మాత్రం మర్చిపోకు. తెల్లవారుజామునే లేవాలి. పిల్లలిద్దరినీ లేపి తయారు చేయాలి. అలారం పెట్టాను. నువ్వు నిద్రపో." భార్యకు అన్ని వివరంగా చెప్పి నిద్రకుపక్రమించాడు ఉమాపతి. ఉమాపతి ఆర్ అండ్ బి లో అసిస్టెంట్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. అతని భార్య జయంతి గృహిణి. ఆమె డిగ్రీ వరకు చదివింది. వారి అన్యోన్య దాంపత్యానికి వారసులుగా ఇద్దరు పిల్లలు పుట్టారు. పది సంవత్సరాల బాబు పేరు అజిత్. వాడు ఐదవ తరగతి చదువుతున్నాడు. ఎనిమిది సంవత్సరాల పాప పేరు అపర్ణ. ఆమె మూడవ తరగతి చదువుతుంది. చురుకైన పిల్లలు. వారం రోజుల క్రితం అజిత పుట్టినరోజు వేడుకను చేశారు. ఆ వేడుకలో ఉమాపతి కొడుకుకి చేసిన వాగ్దానం ప్రకారం ఒక రోజంతా జూ…
Read More