kaalam nerpina paatham by bhavyacharu

కాలం నేర్పిన పాఠం

కాలం నేర్పిన పాఠం పొద్దున్నే లేచాను కాలకృత్యాలు అన్నీ తీర్చుకొని , స్టవ్ పై ఓవైపు బియ్యం మరోవైపు టీ పెట్టుకున్నాను. మరోవైపు ఈరోజు ఏం కూర చేయాలా అని ఆలోచించి ఆ కూరగాయలు కోసుకోవడం మొదలుపెట్టాను. ఈ లోపు పూర్తి అయింది తీసుకొని గ్లాసులో పోసుకొని రెండే బుక్కల్లో తాగేసి గబగబా కూర పొయ్యిమీద వేశాను. ఇంతలో అన్న మయింది అన్నం తీసి కంచంలో పెట్టాను. ఆ పక్కనే పొయ్యిమీద మళ్ళీ ఇడ్లీ కోసం మాత్రమే పెట్టి ఇడ్లీలు వేసాను. కూర కూడా అయిపోగానే కూర దించి పక్కన పెట్టి కొబ్బరి టమాట అన్ని వేసి పక్కన పెట్టి ఉన్నాను. ఇదిలా ఉంటె ఇద్దరు పిల్లలు లేచి, మమ్మీ అంటూ వచ్చారు బాత్ రూం లోకి తీసుకెళ్లి 12 కి కడిగేసి వచ్చాను తర్వాత శుభ్రంగా చేతులు కడుక్కొని ఇంట్లోకి వచ్చాను. మళ్లీ వంట ఇంట్లోకి వచ్చి కుస్తీ పడుతున్నాను.…
Read More