kavanavalli gajal

గజల్

గజల్ రథీఫ్ ; విన్యాసాలు కాఫియా : చూపునవే, మరుపునవే, చెందినవే,పుట్టినవే, చేరినవే, ఎండినవే తిశ్రగతి... 6/6/6/6 కొత్తకొత్త వింతలన్ని చూపునవే విన్యాసాలు/ అలసటంతా చిటికెలోన మరపునవే విన్యాసాలు// ఇంద్రజాల మాయలన్నీ కనికట్టుల ఆటలాయె/ బతుకుపోరు బాటలోకి చెందినవే విన్యాసాలు// ప్రమాదపు అంచులతో సన్ననైనా తీగలాయె/ బాధలల్లో కన్నీళ్లకు పుట్టినవే విన్యాసాలు// మసిబారిన పాలబుగ్గ వేచినాది ఆకలితో/ దైన్యస్థితి శిఖరాన్ని చేరినవే విన్యాసాలు// చేయిచాచి అడగలేని వెర్రిమొర్రి గుండెలాయె/ కర్రలాంటి మోడులలో ఎండినవే విన్యాసాలు// - కవనవల్లి
Read More