kota pentayya

ఉపాధ్యాయుడు అంటే

ఉపాధ్యాయుడు అంటే 1) బ్రహ్మ విష్ణు ఈశ బహు రూపు లు గురువు    విశ్వ మంత నిండి విశదపరచు    గురువు గొప్పదనము గుర్తెరింగిననాడు    మానవాళి పొందుమహితసుఖము 2) వృత్తి ధర్మ మొకటి.భుక్తిధర్మమొకటి    ఇరుగుపొరుగు వారు యిష్టపడగ    అన్ని ధర్మ ములను అలవోకపాటించు    మనసు నెరిగిమసలు మంచి గురువు 3) ప్రశ్న వేయు నేర్పు పసివార్కినేర్పాలి    ప్రశ్న వల్ల మంచిఫలితముండు    ఎందుకెప్పుడెట్లుఏమిటీ దేనికీ?    గురువు వల్ల ప్ర శ్నగుట్టుదెలియు 4) పిన్నవారినైనప్రేమతోపిలుచుచూ    శుద్ధమాటచెప్పిబుద్ధిమార్చు    గగనమంతకీర్తి.గర్వమేలేకుండు    నట్టి తల్లి సమము ఆదిగురువు 5) బాధ్యతెరుగకుండబడియందుగురువులు    గంటకొట్టువరకుగడుపువారు    తనకు చెప్పరాకతప్పించుకోజూచు    బాధగురువువల్లబోధకల్ల - కోట పెంటయ్య
Read More

కరోనా జాగ్రత్తలు ఆటవెలదులు

కరోనా జాగ్రత్తలు ఆటవెలదులు   బయటకెళ్ళునపుడు బాధ్యత మరువకు మాస్కును ధరియించు మంచిదౌను దూరముండ వలెను దుష్ట కరోనకు టీక వేయువరకు తిరుగ రాదు. బాలవాక్కులన్ని బ్రహ్మ వాక్కు లంటు భేదమనకచెప్పె వేదవాక్కు భావిపౌరులైన పసివారి పనిపట్ట కసికరోన ముందుకరుగు చుండె. మానవత్వ మంత మంటగలుపుచుండె మనసు కరుగదీ కరోన కేమి బతికి యున్ననాటి బంగారు బంధాలు మానవ మనుగడకు మచ్చ తెచ్చె. తల్లి దండ్రి లేక తల్లడిల్లెడివారు అమ్మ పాలు దాగ అరచువారు ఆదరించుఅమ్మ ఆనవాలు గనక దీనులై వెదికిరి దిక్కు లేక. ఒకరు వదిలిన గాలి నొకరు పీల్చిన వచ్చు మాయదీకరోన మరువ వద్దు రక్త నాళములకు శక్తి మార్గము మూయు ప్రాణ వాయువింక పారిపోవు. మాదీ కరోన మాయమయ్యేదాక మనము యింటియందె మసలవలయు దూరబంధువంటు దర్శించ వచ్చినా ఆత్మ బంధువంటు హత్తుకోకు. ఆకలి కడుపులకు అలసటతోడాయె కాళ్ళు నడవలేక కూలబడెను కళ్ళుతిరుగుడాయె కడుపులో మంటలు మానవత్వమంత మూగబోయె.…
Read More

కరోనా ఆటవెలదులు

కరోనా ఆటవెలదులు 1) లాకుడౌను వల్ల లాసైన దేశము రెండవ అలవల్ల రెంటజెడెను గుర్తు పట్టనంత గుట్టుగా వ్యాపించి కాటికంపు చుండెగా కరోన 2) చాపకింద నీటిచందాన దరిజేరి ఆనవాలు లేక అంటుకొనును సబ్బుతో కరములను శుభ్రంగ కడగాలి కాదు కూడదంటె కలుగు ముప్పు 3) చేతులెత్తి మొక్కు షేకుహాండివ్వకు దరికిబోయి దాన్ని తగులుకోకు మరల తిరిగి వచ్చె మాయదారి కరోన మాస్కు బెట్టి దాన్ని మట్టుబెట్టు 4) భౌతికముగ ఎడము పాటించి తీరాలి ఒరుసుకుంటు తిరుగ ఒంటికంటు ఎడము ఉండవలెను ఏ జనమెదురైన లెక్క జేయకుంటె ప్రక్క జేరు - కోట పెంటయ్య
Read More

కరోనా..(ఆటవెలదులు)

కరోనా..(ఆటవెలదులు) 01)లాకుడౌను వల్ల లాసైన దేశము రెండవ అలవల్ల రెంటజెడెను గుర్తు పట్టనంత గుట్టుగా వ్యాపించి కాటికంపు చుండెగా కరోన 02) చాపకింద నీటిచందాన దరిజేరి ఆనవాలు లేక అంటుకొనును సబ్బుతో కరములను శుభ్రంగ కడగాలి కాదు కూడదంటె కలుగు ముప్పు 03) చేతులెత్తి మొక్కు షేకుహాండివ్వకు దరికిబోయి దాన్ని తగులుకోకు మరల తిరిగి వచ్చె మాయదారి కరోన మాస్కు బెట్టి దాన్ని మట్టుబెట్టు 04) భౌతికముగ ఎడము పాటించి తీరాలి ఒరుసుకుంటు తిరుగ ఒంటికంటు ఎడము ఉండవలెను ఏ జనమెదురైన లెక్క జేయకుంటె ప్రక్క జేరు... - కోట పెంటయ్య
Read More