maata

మాట

మాట నారాయణ కు ముగ్గురు పిల్లలు ఇద్దరూ ఆడపిల్లలు, ఒక అబ్బాయి. నారాయణ ముగ్గుర్నీ బాగానే చదివిస్తున్నారు. ఆయనకు పిల్లలు అంటే చాలా ఇష్టం. ఉన్నంతలో బాగానే ఉన్నారు. ఒకరికి అన్నం పెట్టే స్థోమత కలిగిన నారాయణ అప్పుడప్పుడు అన్నదానం లాంటివి చేస్తూ ఉంటాడు. అలాంటి ఒకరోజు గుళ్ళో అన్నదానం జరుగుతున్న సమయంలో గుడి మెట్ల పైన ఉన్న అందరినీ మండపం లోకి రమ్మని పిలవాలని వచ్చాడు. అందర్నీ బాబు నేను ఈ రోజు అన్నదానం చేస్తున్నా రండి వచ్చి భోజనం చేయండి అన్నాడు. ధర్మ ప్రభువులు అంటూ అందరూ లోపలికి వెళ్ళారు. అందరితో పాటు లోపలికి వెళ్లబోతుంటే నారాయణ కు చివరి మెట్టు పై తల పై కొంగు వేసుకుని ఉన్న ఒక నలభై ఏళ్ళ ఆవిడ అలాగే కూర్చుని ఉండడం గమనించి, ఆమెకు వినిపించ లేదేమో అనుకుంటూ, ఆమె దగ్గరగా వచ్చాడు. ఆమెతో నారాయణ, అమ్మా మీకు వినిపించనట్లు…
Read More