నాతిచరామి
నాతిచరామి గతంలో రాసిన ఇంటింటి రామాయణం లో భాగంగా ఇదొక భాగం, ఇది నాతిచరామి అనే శీర్షిక కు సరిపోతుంది అని భావిస్తూ, మీ అభిప్రాయం తెలుపండి. దాని గురించి, దాని భర్త నరయ్య గురించి ఆలోచిస్తూ కూర్చున్న నేను మాలచ్చి తండ్రి భద్రయ్య మా అమ్మగారి ఊర్లో పెద్ద పాలేరు అప్పుడన్ని గోవులు, బర్రెలు, వ్యవసాయనికి చెదోడు వాదోడుగా ఉండేవాడు, మా చిన్నప్పుడు మాకేం కావాలన్నా నిమిషంలో తెచ్చి పెట్టె వాడు ఎప్పుడూ నవ్వుతూ, నవ్విస్తూ ఉండే భద్రయ్య రాత్రి కాగానే మాత్రం బాగా తాగేసి, తన పాక లో ఉన్న తన భార్య పంకజంని బండ బూతులు తిడుతూ ఊగిపోయేవాడు భద్రయ్య ... అంత తిడుతున్నా కూడా పంకజం ఒక్క మాట కూడా బయటకు రాకుండా, వాడి వాగుడు అంతా అయ్యాక నులక మంచం లో పడుకుంటే వాడికి అన్నం కలిపి పెట్టేది ఎంతో ప్రేమగా. మా పెళ్లిళ్లు…