nannako lekha

నాన్నకో లేఖ

నాన్నకో లేఖ ప్రియమైన నాన్నగారికి ప్రేమతో రాస్తున్న లేఖ .... నాన్న నువ్వు మాకు ఎంతో జీవితాన్ని ఇచ్చావు. సంపదలు లేకున్నా, ఆస్తులు ఇవ్వక పోయినా, చదువు, సంస్కారం నేర్పావు. నాన్న నువ్వు మాతో ఎప్పుడూ స్నేహంగా లేవు, మమల్ని ఎప్పుడూ కొడుతూ ఉండేవాడివి. అప్పుడు మేము చాలా తిట్టుకునే వాళ్ళం. ఎప్పుడూ కొడతావు, తిడతావు అని, కానీ అవన్నీ మా మంచికే అని ఇప్పుడు అర్ధం అవుతుంది. నాన్న నువ్వు అందరితో కలిసిపోతూ, సాయం చేస్తుంటే అందరికీ మంచి చేస్తావు మాకేం చేయవు అని అనుకునే వాళ్ళం. అందర్నీ నీ వాళ్ళే అనుకుంటూ వారికి సాయం చేస్తూ, ఉచిత విద్య నేర్పుతుంటె నీకు బతకడం తెలియదని అనుకున్నాం. పెద్ద ఇల్లు, కారు లేవని సంపాదించే శక్తి లేదనుకున్నాము, తెలివి లేదని తిట్టుకున్నాము. పరోపకారం మిదం శరీరం అన్నట్టు పరోపకారం చేస్తుంటే పసలేని వాడివి అనుకున్నాం. లెక్కలు రాకుంటే పక్కనుండి మరి కొట్టిస్తుంటే…
Read More